దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది శ్రుతి హాసన్. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో శ్రుతి ఒకరు. వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు రెండేళ్లుగా సినిమాలు దూరంగా ఉంది. ఇటీవలే మళ్లీ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. ‘వకీల్‌ సాబ్‌’, ‘క్రాక్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా శ్రుతి.. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో చిన్ననాటి ఫొటోలను పోస్ట్‌ చేసింది. పాఠశాలలో చదువుకుంటోన్న సమయంలో తన స్నేహితులతో కలిసి తీసుకున్న ఫొటోను ఆమె పోస్ట్ చేసింది. ఇందులో ఆమె తన స్నేహితుల మధ్య కూర్చొని ఉంది.  ఫొటోలో తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. అలాగే,  1993లో తాను ఆడుకుంటోన్న సమయంలో కోతి బొమ్మపై కూర్చొని తీసుకున్న మరో ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

కాగా కమల్ వారసురాలిగా శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. కమల్ పొలిటికల్ ఎంట్రీ పై సంచలన కామెంట్లు చేసింది. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తన తండ్రికి తన సపోర్ట్ ఉండదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పుకొచ్చింది. తన తండ్రి రాజకీయ ప్రవేశం పై ఎప్పుడు ఈ అమ్మడు మాట్లాడలేదు. తాజాగా ఎన్నికల ప్రచారంలో తన మద్దతు ఉండదని చెప్పేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *