హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ ఎందుకు ఆడలేకపోయాడంటే..?

By సుభాష్  Published on  9 Oct 2020 6:24 AM GMT
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ ఎందుకు ఆడలేకపోయాడంటే..?

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు విధ్వంసకర వీరుడు క్రిస్‌గేల్‌ను వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ పక్కన పెట్టింది. నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ ఆడాల్సి ఉందని.. అయితే ఆఖరి నిమిషంలో అతడు మ్యాచ్‌కు దూరం అయ్యాడని పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) 13వ సీజన్‌ మొదలై.. దాదాపు సగం సీజన్‌ ముగుస్తున్నా కూడా గేల్‌ను మైదానంలో చేసే అవకాశం రాలేదు. దీంతో గేల్‌ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోని పంజాబ్‌ జట్టు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో జట్టును మార్చడం లేదనుకున్నా అదీ లేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు ఓటములను చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికల్లో చివరి స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆప్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ ఎందుకు ఆడలేదో పంజాబ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే చెప్పాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్‌ తుది జట్టులో ఉన్నాడని, కానీ.. గురువారం పుడ్‌పాయిజన్‌ కారణంగా కడుపునొప్పితో బాధపడుతుండటం వల్ల చివరి క్షణాల్లో తప్పుకున్నాడని సృష్టం చేశాడు. కాగా.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు 201 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. చేధనలో పంజాబ్‌ జట్టు 132 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్‌లో గేల్‌ ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడి 4,484 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్‌ 175 నాటౌట్. 326 సిక్సర్లు బాది ఐపీఎల్‌లో అందరికి కన్నా ముందున్నాడు. ఆ తర్వాతి స్థానంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు మిస్టర్‌ 360డిగ్రీస్ ఏబీ డివిలియర్స్‌(219) ఉన్నాడు.

Next Story