న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  3 July 2020 11:02 AM GMT
న్యూస్‌మీటర్‌ టాప్‌ 10 న్యూస్‌

మీ ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదు: మోదీ

సైనికుల ధైర్య సాహసాలను దేశం ఎప్పటికీ మర్చిపోదని, దేశమంతా మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందుతుందని ప్రధాన నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం చీఫ్‌ అఫ్‌ డిఫెన్స్‌ బిపిన్‌ రావత్‌, ఆర్మీ చీఫ్‌తో కలిసి లడఖ్ లేహ్‌లో పర్యటించిన మోదీ.. సరిహద్దు పరిస్థితులపై సైనికులతో సమీక్ష జరిపారు. సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో నీమ్‌లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. .. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారతీయ రైల్వే మరో సరికొత్త రికార్డు

భారతీయ రైల్వేశాఖ మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల జూన్‌లో గుజరాత్‌లోని పాలంపూర్‌ -బొటాడ్‌ స్టేషన్ల మధ్య 7.57 మీటర్ల ఎత్తయిన డబుల్ డెక్కర్‌ కంటైనర్‌ రైలు నడిపి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది విద్యుత్‌ మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన రైలును పట్టాలపై పరుగులు పెట్టించి రికార్డు నెలకొల్పించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో రెండు రైళ్లను ఒక్కటిగా చేసి ఒడిశాలోని సంబల్‌పూర్ డివిజన్‌లో అనకొండ పేరుతో రెండు కిలోమీటర్ల పొడవైన రైలును నడిపి రికార్డు సృష్టించగా, ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ.. పూజలందుకోవాలే గానీ.. మూన్నాళ్ల ముచ్చట చేసుకోవద్దు

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో కాపుల రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు. మీరు అడిగిన వారికి, అడగని వారికి దానాలు చేసి దానకర్ణుడు అనిపించుకుంటున్నారని, రిజర్వేషన్ల సమస్యను కూడా తీర్చమని అభ్యర్థించారు. రిజర్వేషన్ల పోరాటానికి గతంలో మద్దతు ఇచ్చిన విషయాన్ని ముద్రగడ పద్మనాభం గుర్తు చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

సారుకు రావాల్సిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్న కిషన్ రెడ్డి

ఆలోచనలు మస్తు ఉండొచ్చు. ఆచరణ ఎంత వేగంగా జరిగితే అంత మంచిది. మదిలో ఉన్న ఆలోచనల్ని అదే పనిగా చెప్పుకుపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. చేతల్లో చేసి చూపిస్తేనే ప్రయోజనమన్న మాట.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అర్థమయ్యేలా చేసి.. షాకిచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఉన్నట్లుండి పీవీ శతజయంతి ఉత్సవాల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారీగా నిర్వహించనుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గుడ్‌న్యూస్‌: ఆగస్ట్‌ లో కరోనా వ్యాక్సిన్‌.. ఐసీఎంఆర్‌ ప్రకటన

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరణాల సంఖ్య కూడా బాగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత వైద్ఉయ పరిశోధన మండలి (ICMR) దేశ ప్రజలకు శుభవార్త వినిపించింది. హైదరాబాద్‌కు చెందిన బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ కలిసి కరోనాకు సంబంధించి ‘కోవాక్సిన్‌’ అనే మందును తయారు చేస్తోంది. దానిని ఆగస్ట్‌ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ఐసీఎంఆర్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరో చేదు వార్త విన్న బాలీవుడ్..!

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ శుక్రవారం నాడు మరణించారు. 71 సంవత్సరాల సరోజ్ ఖాన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉండడంతో సరోజ్ ఖాన్ ను జూన్ 20న గురు నానక్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. కరోనా టెస్టులు నిర్వహించగా నెగటివ్ అని రిజల్ట్ వచ్చింది. ఉదయం 2:30 సమయంలో సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించిందని ఆమె బంధువులు స్పష్టం చేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. 24గంటల్లో 20,903కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,903 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. నిన్న ఒక్క రోజే 379 మంది మృతి చెందారు. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 6,25,544 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 18,213 మంది మరణించారు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బ్యాటింగ్ విషయంలో సలహా ఇచ్చినందుకు మెడ మీద కత్తి పెట్టాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ తన మెడపై యూనిస్ ఖాన్ కత్తి పెట్టాడని ఆరోపించాడు. ఆస్ట్రేలియా టూర్ కు పాకిస్థాన్ జట్టు వెళ్ళినప్పుడు యూనిస్ ఖాన్ టెక్నిక్ విషయంలో కొన్ని మార్పులు సూచించగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తన మెడ మీద కత్తి పెట్టినట్లు చెప్పుకొచ్చాడు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్న కేసీఆర్

వేలెత్తి చూపించటాళ్లు.. విమర్శలు.. ఇలా అన్నీ అయ్యాక.. ఇప్పటికి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర సర్కారు. మహమ్మారిని నిర్దారించేందుకు వేగంగా ఫలితాలు చెప్పే ర్యాపిడ్ టెస్టులు (ర్యాపిడ్ యాంటీజెన్ డిటెక్షన్ టెస్టు) చేయించేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అనుమానితులకు కేవలం పదిహేను నిమిషాల్లో వైరస్ ఉందో లేదో అన్న విషయాన్ని నిర్దారించే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఎవరీ వికాస్ దూబే.. పోలీసులనే చంపగలిగే క్రిమినల్ గా ఎలా ఎదిగాడు..?

ఉత్తరప్రదేశ్ రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు పోలీసులు గత రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపడుతూ కాన్పూర్‌ సమీపంలోని అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి అర్థరాత్రి వెళ్లారు. అతని నివాసానికి పోలీసులు చేరుకుంటున్న క్రమంలో ఓ ఇంటిపై మాటు వేసిన దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాసహా మొత్తం 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Next Story
Share it