మరో చేదు వార్త విన్న బాలీవుడ్..!

By సుభాష్  Published on  3 July 2020 4:04 AM GMT
మరో చేదు వార్త విన్న బాలీవుడ్..!

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ శుక్రవారం నాడు మరణించారు. 71 సంవత్సరాల సరోజ్ ఖాన్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతూ ఉండడంతో సరోజ్ ఖాన్ ను జూన్ 20న గురు నానక్ ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. కరోనా టెస్టులు నిర్వహించగా నెగటివ్ అని రిజల్ట్ వచ్చింది. ఉదయం 2:30 సమయంలో సరోజ్ ఖాన్ గుండెపోటుతో మరణించిందని ఆమె బంధువులు స్పష్టం చేశారు. కొద్దిరోజుల కిందట ఆమె కోలుకుంటోందని, ఇక డిశ్చార్జ్ చేయొచ్చని భావించారు ఇంతలోనే ఇలా జరగడం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఆమె అంత్యక్రియలు ఈరోజు నిర్వహిస్తారని తెలుస్తోంది. పలువురు ప్రముఖులు ఆమె మరణవార్త విని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

సరోజ్ ఖాన్ నేషనల్ అవార్డు విజేత.. పలు బాలీవుడ్ డ్యాన్స్ హిట్స్ కు ఆమె కొరియోగ్రఫీ అందించింది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్ ల డ్యాన్స్ హిట్స్ సరోజ్ ఖాన్ కంపోజ్ చేసినవే. మిస్టర్ ఇండియా, నగీన, చాందిని సినిమాల్లోని పాటలకు కొరియోగ్రఫీ అందించింది. శ్రీదేవి డ్యాన్స్ చేసిన హవా.. హవాయి.. పాటకు పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది. మాధురీ దీక్షిత్ సూపర్ డూపర్ డ్యాన్స్ హిట్స్ అయిన తేజాబ్ సినిమాలోని ఏక్ దో తీన్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ్మా తమ్మా లోగే, ధక్ ధక్ కర్నే లగా లాంటి పాటలకు కూడా సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందుకున్నారు.

దేవదాస్ సినిమాలోని 'డోలా రే డోలా' పాటకు నేషనల్ అవార్డు అందుకుంది సరోజ్ ఖాన్. తేజాబ్, బేటా, చాల్బాజ్ , ఖల్నాయక్, హమ్ దిల్ దే చుకే సనమ్, దేవ్ దాస్, గురు సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది.

Next Story