క్షమించు మామ నీ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2020 2:14 PM GMT
క్షమించు మామ నీ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు

భారత్‌, చైనా సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను నిషేదించినట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ కూడా ఉంది. చైనా యాప్‌ల నిషేదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు నిఖిల్‌, సందీప్‌ కిషన్‌ల మధ్య జరిగిన సంభాషణ నెటింట్లో వైరల్‌ అయింది.

‘టిక్‌టాక్‌ను నిషేధించరాదు.. మన దేశాన్ని మన ప్రజాస్వామ్యాన్ని గౌరవించేంత వరకే’ అంటూ ట్వీట్‌ చేశాడు నిఖిల్‌.



అది చూసిన హీరో సందీప్‌ కిషన్‌ స్పందిస్తూ.. ‘నాది కూడా అదే అభిప్రాయం మామ. కానీ ఇప్పుడు చైనా యాప్‌లను నిషేధించడం అవసరం. చైనా ప్రభుత్వం చేసేది సరైనది కాదు. అయితే మనం కూడా ఉపాధిని కోల్పోతామనుకో.. కానీ ప్రభుత్వ నిర్ణయం ఏంటో కూడా చూడాలి’ అంటూ రిప్లై ఇచ్చాడు.



దీనికి నిఖిల్‌.. ‘అవును మామ.. కానీ నా ట్వీట్‌ మళ్లీ చదువు.. అందులోని వ్యంగ్యం అర్థం అవుతుంది’ అంటూ రిట్వీట్‌ చేసి.. చైనా ఉత్పత్తులను నిషేధించాలని పిలుపునిస్తూ #BanChineseProducts అనే హ్యాష్‌ ట్యాగ్‌ను వైరల్‌ చేయమని కోరాడు. దీనికి ‘సందీప్‌ క్షమించు మామ నీ వ్యంగ్యాన్ని అర్థం చేసుకోలేదు’ అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన చాట్‌ నెటీజన్లను ఆకట్టుకుంటోంది.



Next Story