భారతీయ రైల్వే మరో సరికొత్త రికార్డు

By సుభాష్  Published on  3 July 2020 10:19 AM GMT
భారతీయ రైల్వే మరో సరికొత్త రికార్డు

భారతీయ రైల్వేశాఖ మరో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల జూన్‌లో గుజరాత్‌లోని పాలంపూర్‌ -బొటాడ్‌ స్టేషన్ల మధ్య 7.57 మీటర్ల ఎత్తయిన డబుల్ డెక్కర్‌ కంటైనర్‌ రైలు నడిపి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది విద్యుత్‌ మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన రైలును పట్టాలపై పరుగులు పెట్టించి రికార్డు నెలకొల్పించింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో రెండు రైళ్లను ఒక్కటిగా చేసి ఒడిశాలోని సంబల్‌పూర్ డివిజన్‌లో అనకొండ పేరుతో రెండు కిలోమీటర్ల పొడవైన రైలును నడిపి రికార్డు సృష్టించగా, తాజాగా 177 వ్యాగన్లతో ఉన్న 2.8 కిలోమీటర్ల పొడవైన గూడ్స్‌ రైలును ఒకేసారి పట్టాల మీద పరుగులు పెట్టించాడు. సూపర్‌ అనకొండగా పిలిచే ఈ రైలు ఒడిశా బిలాస్‌పూర్‌ డివిజన్‌లోని లజ్‌కురా-రవుర్కెల మధ్య ఈ రైలు పరుగులు తీసింది.

వాస్తవానికి ఇది ఒక్కరైలు కాదు.. మూడు రైళ్లను కలిపి ఒక్కటిగా చేశారు. అలా 177 వ్యాగన్లలో 15వేల టన్నుల బొగ్గును ఒకేసారి ట్రన్స్‌ పోర్టు చేయడం విశేషం. ఈ మేరకు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కావడంతో సరుకులను రవాణా చేసే రైళ్లను సరికొత్త విధానంలో రవాణా చేసేందుకు ఇలా కసరత్తు చేస్తోంది.Next Story
Share it