రైల్వే చరిత్రలోనే ఇది తొలిసారి

By సుభాష్  Published on  2 July 2020 9:33 AM GMT
రైల్వే చరిత్రలోనే ఇది తొలిసారి

రైల్వే వ్యవస్థ అంటే ఎప్పుడు ఆలస్యమనే తెలుసు. ఏ రైలు కూడా సమయానికి రాదు.. సమయానికి గమ్యానికి చేరుకోదనేది ముమ్మాటికి నిజం. ఎక్కుమ మట్టుకు రైళ్లన్ని ఆలస్యంగానే నడుస్తుంటాయి. కానీ భారతీయ రైల్వే అరుదైన ఘనతను సాధించింది. రైల్వే చరిత్రలో తొలిసారిగా అన్ని రైళ్లు జూలై 13న వందశాతం సమయ పాలన పాటించాయని భారత రైల్వే శాఖ తెలిపింది. బుధవారం నడిచిన 201 రైళ్లు సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నాయని, భారత రైల్వే చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి అని పేర్కొంది. ఇక ఇదే ఏడాది జూన్‌ 23న ఈ రికార్డు 99.54శాతం నమోదైంది.

ఒకే ఒక్క రైలు ఆలస్యంగా నడవడం వల్ల అప్పుడు 100 శాతం సమయపాలన రికార్డును అందుకోలేకపోయిందని పేర్కొంది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అన్నిసాధారణ ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసి భారతీయ రైల్వే అత్యవసర సర్వీసులను మాత్రమే నడుపుతోంది.

కాగా, ప్రత్యేక రైళ్లు, ప్యాసింజర్‌ రైళ్ల షెడ్యూల్‌లో ఎటువంటి ఆలస్యం లేకుండా చూసుకోవాలని రైల్వే బోర్డు చైర్మన్‌ వికె యాదవ్‌ రైల్వే జనరల్ మేనేజర్లు, డివిజనల్‌ రైల్వే మేనేజర్లకు సూచించారు. ప్రస్తుతం కరోనా కాలంలో నడుస్తున్న రైళ్లు చాలా తక్కువ ఉన్నందున సమయ స్ఫూర్తి వందశాతం ఉండాలన్నారు. అలాగే రైల్వే ప్రాజెక్టులో ప్రైవేటు రంగాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానం పలికినట్లు, ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.30వేల కోట్ల ప్రైవేటురంగ పెట్టుబడులు వస్తాయని రైల్వే మంత్రిత్శశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 151 ఆధునిక రైళ్లు ప్రవేశపెట్టనున్నట్లు, ప్రతి రైలులో కనీసం 16 బోగీలు ఉంటాయని భారత రైల్వే తెలిపింది.

Next Story
Share it