న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 23 Dec 2019 9:46 PM IST1. మూడు రాజధానుల వెనుక రహస్యం ఏంటో చెప్పిన చంద్రబాబు
సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ప్రకటించడం వెనుక ఉన్న రహస్యం తనకు తెలుసని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం చంద్రబాబు తుళ్లూరులో పర్యటించారు. వివిధ ప్రాంతాల మధ్య చిక్కులు పెట్టి, పబ్బం గడుపుకోవడమే మూడు రాజధానుల వెనుక ఉన్న అసలైన రహస్యమని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. ఈ మాటలు విన్న తుళ్లూరు రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
2. బీజేపీకి షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు..!
జార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని ఎన్సీపీ,శివసేనలు వ్యాఖ్యనించాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాగా, మోదీ, అమిత్ షాలకు జార్ఖండ్ ఓటర్లు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన ట్విట్ చేశారు. మోదీ, అమిత్ షాలు ఎంత కష్టపడినప్పటికీ జార్ఖండ్‌లో బీజేపీ తన అధికారాన్ని కోల్పో వల్సి వచ్చిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
3. కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష
సౌదీ అరేబియా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మీడియా జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలవరించింది. ఈ 2018, అక్టోబర్ 2న జరిగిన ఈ హత్య కేసు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్య కేసులో మొత్తం 11 నిందితుల్లో ఐదుగురికి మరణ శిక్ష, మిగతా ముగ్గురికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
4. మెట్రో టికెట్ కోసం కౌంటర్ కి వెళ్లక్కర్లేదు..!
హైదరాబాద్ లో మెట్రో పరుగులు మొదలై రెండేళ్లయింది. మియాపూర్ నుంచి ఎల్ బి నగర్, నాగోల్, ఇటు హైటెక్ సిటీ వరకూ మెట్రో పరుగులు పెడుతోంది. ఇందులో నిత్యం ప్రయాణించే వారి సంఖ్య వేల సంఖ్యలో ఉంటోంది. ముఖ్యంగా మొన్నటి వరకూ ఆర్టీసీ సమ్మె చేయడంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి పోయాయి. అయితే ఈ రైలులో ప్రయాణించేందుకు స్మార్ట్ కార్డు ఉన్నవాళ్లు సేఫ్ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
5. తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల నరాగా మోగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈమేరకు ఇందుకు సంబంధించిన షెడ్యుల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 11న నామినేషన్ల పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
6. బీసీసీఐ ప్రెసిడెంట్‌కు ఛాలెంజ్ విసిరిన క్రికెటర్ మిథాలీ రాజ్
హైదరాబాద్: మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ భారత మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ అన్నారు. పచ్చని చెట్లు లేకపోతే సమతుల వాతావరం దెబ్బతింటుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఆదివారం నాడు తిరుమలగిరిలోని తన నివాసంలో మిథాలీ రాజ్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
7. ఎన్‌ఆర్సీపై సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్‌ఆర్సీ బిల్లుపై సంచలన ప్రకటన చేశారు. ఎన్‌ఆర్సీ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు పలకబోమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి అంజద్ పాషా ఇటీవల వ్యాఖ్యలు చేశారని,ఆ వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని జగన్ తమ ప్రభుత్వం ఈ బిల్లుకు వ్యతిరేకమని, రాష్ట్రంలో ఈ బిల్లు అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
8. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన అమిత్ షా
జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఐదేళ్ల పాటు పాలన భారతీయజనతాపార్టీకి ఇచ్చినందుకు కృతజ్ఞక్షత చెబుతున్నానని అన్నారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, ట్విట్టర్ ద్వారా అమిత్‌షా ఏం తెలిపారంటే..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
9. యువతి శరీరంలో బుల్లెట్…మాకేం తెలీదంటున్న తల్లిదండ్రులు
హైదరాబాద్ : యువతి శరీరంలో బుల్లెట్ వ్యవహారం ఓ మిస్టరీగా మారింది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో ఓ యువతి(18)కి ఆపరేషన్ చేస్తుండగా బుల్లెట్ బయటపడటం కలకలం రేపుతోంది. ఈ బుల్లెట్ వ్యవహారంపై వైద్యులు, పోలీసుల తీరుపై యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెన్నునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వస్తే…ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటికి... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…
10. మెగా మేనల్లుడి కెరీర్ కు ప్రాణం పోసింది !
‘బాలయ్య’తో పోటీ పడి మరీ తన సినిమాని విడుదల చేసిన సాయి ధరమ్ తేజ్ కి మొత్తానికి బాక్సాఫీస్ వద్ద బాగానే కలిసి వచ్చింది. ‘చిత్రలహరి’ ముందు వరకూ చేసిన ‘తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్ ఐ లవ్ యు’ ఇలా తేజ్ సినిమాలన్నీ భారీ డిజాస్టర్‌లే. దాంతో సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పోటీగా వచ్చి ఓవరాల్ గా హిట్ ను అందుకున్నాడు ఈ మెగా మేనల్లుడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి…