కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష

By Newsmeter.Network  Published on  23 Dec 2019 11:55 AM GMT
కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి ఉరిశిక్ష

సౌదీ అరేబియా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మీడియా జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి హత్య కేసులో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలవరించింది. ఈ 2018, అక్టోబర్‌ 2న జరిగిన ఈ హత్య కేసు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ హత్య కేసులో మొత్తం 11 నిందితుల్లో ఐదుగురికి మరణ శిక్ష, మిగతా ముగ్గురికి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. ఇక మిగిలిన దోషులకు ఇంకా శిక్ష ఖరారు కాలేదు. ఈ జర్నలిస్టు హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్న ఐదుగురికి కోర్టు ఉరి శిక్ష విధించినట్లు ప్రాసిక్యూటర్‌ పేర్కొన్నారు. ఇందులో సౌదీ యువరాజు అయిన మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. కాగా, ఈ కేసు నిర్దోషుల్లో సౌదీ మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి కూడా ఉన్నారు. ఈ హత్య కేసులో రియాద్‌ కోర్టు అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో పాటు మృతుడి బంధువుల కూడా హాజరైనట్లు ఆయన తెలిపారు.

Five Sentenced To Death

కాగా, అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్టు పత్రికలో జర్నలిస్టుగా పని చేసేవారు. సౌదీ ప్రభుత్వంపై తరుచూ విమర్శలు చేసేవాడు. ఈ క్రమంలో టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో సౌదీ సర్కార్‌ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. సౌదీపై విమర్శలు అధికం కావడంతో మొత్తం 11 మందిని సౌదీ ప్రభుత్వం అరెస్టు చేసింది.

Next Story