జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఐదేళ్ల పాటు పాలన భారతీయజనతాపార్టీకి ఇచ్చినందుకు కృతజ్ఞక్షత చెబుతున్నానని అన్నారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, ట్విట్టర్‌ ద్వారా అమిత్‌షా ఏం తెలిపారంటే..

‘జార్ఖండ్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. బీజేపీకి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు.. వారికి ధన్యవాదాలు..రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం శ్రమిస్తుంది. పార్టీ కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తలకు అభినందనలు’ అంటూ ట్విట్‌ చేశారు అమిత్‌ షా.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.