జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలపై స్పందించిన అమిత్‌ షా

By సుభాష్  Published on  23 Dec 2019 8:05 PM IST
జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలపై స్పందించిన అమిత్‌ షా

జార్ఖండ్‌ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పందించారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఐదేళ్ల పాటు పాలన భారతీయజనతాపార్టీకి ఇచ్చినందుకు కృతజ్ఞక్షత చెబుతున్నానని అన్నారు. పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. కాగా, ట్విట్టర్‌ ద్వారా అమిత్‌షా ఏం తెలిపారంటే..

'జార్ఖండ్ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. బీజేపీకి ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇచ్చారు.. వారికి ధన్యవాదాలు..రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ నిరంతరం శ్రమిస్తుంది. పార్టీ కోసం ఎంతో కష్టపడిన కార్యకర్తలకు అభినందనలు' అంటూ ట్విట్‌ చేశారు అమిత్‌ షా.

Next Story