న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 2 July 2020 4:05 PM ISTరైల్వే చరిత్రలోనే ఇది తొలిసారి
రైల్వే వ్యవస్థ అంటే ఎప్పుడు ఆలస్యమనే తెలుసు. ఏ రైలు కూడా సమయానికి రాదు.. సమయానికి గమ్యానికి చేరుకోదనేది ముమ్మాటికి నిజం. ఎక్కుమ మట్టుకు రైళ్లన్ని ఆలస్యంగానే నడుస్తుంటాయి. కానీ భారతీయ రైల్వే అరుదైన ఘనతను సాధించింది. రైల్వే చరిత్రలో తొలిసారిగా అన్ని రైళ్లు జూలై 13న వందశాతం సమయ పాలన పాటించాయని భారత రైల్వే శాఖ తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ప్రజాదరణ పొందుతోన్న స్వదేశీ యాప్ లు
చైనా ఆటకట్టించేందుకు భారత్ లో ఆ దేశానికి సంబంధించిన 59 యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో అత్యంత ప్రజాదరణ పొందిన టిక్ టాక్, హలో, షేర్ ఇట్ వంటి యాప్ లు కూడా ఉన్నాయి. టిక్ టాక్, హలో యాప్ లకు బాగా అలవాటు పడిన నెటిజన్లు..ఇప్పుడు ఆ యాప్ రాకపోవడంతో స్వదేశీ యాప్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అచ్చు గుద్దినట్లు టిక్ టాక్ ఫీచర్స్ ను పోలిన చింగారి యాప్ ను గంటల వ్యవధిలో లక్షలాది మంది డౌన్ లోడ్లు చేసుకుంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమం
విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలొజా జైల్ నుంచి వీవీ భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లోయర్ కోర్టు కొట్టివేయగా.. మహారాష్ట్ర హైకోర్టులో బెయిల్ పిటీషన్‌ను వేశారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వాళ్లు వచ్చేసరికి.. నా భార్యను అల్మారాలో దాచా : ముస్తాక్
ఎంతో మంది బ్యాట్స్‌మెన్లకు తన స్పిన్ బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు సక్లైన్ ముస్తాక్. పాకిస్థాన్ దిగ్గజ ఆటగాళ్లలో అతను ఒకడు. తాజాగా ముస్తాక్ ఓ సరదా సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. అది 1999 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన ఘటన. కుటుంబ సభ్యులను ఇంటికి పంపాలని టోర్నీ మధ్యలో బోర్డు ఆదేశించినా.. తాను మాత్రం తన భార్యను బీరువాలో దాచి ఉంచిన విషయాన్ని బయటపెట్టాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో పాకిస్థాన్ రన్నరప్‌గా నిలిచింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్ లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ మనసులో ఏముంది..?
రోజురోజుకీ పెరుగుతున్న మహమ్మారి కేసులు తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజులో వంద కేసులు నమోదైన పరిస్థితితో హడలిపోయిన పరిస్థితి నుంచి తాజాగా రోజులో వెయ్యి కేసుల్ని దాటేసిన పరిస్థితి చూస్తే.. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం స్పష్టమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగరంలో లాక్ డౌన్ ను విధించటం మినహా మరో మార్గం లేదని చెబుతున్నారు. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జీవీకే సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి, కుమారుడు సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు
జీవీకే గ్రూప్ సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదైంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కాంట్రాక్ట్ ఒప్పందంలో జీవీకే గ్రూప్ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే 9 ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి బోగస్ వర్క్ కాంట్రాక్టులు చూఏపించి రూ. 310 కోట్లు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. వీటిలో అధిక భాగం 2017-18మధ్య ముంబై విమానాశ్రయం చుట్టూ 200 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వినియోగించినట్లు సీబీఐ పేర్కొంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కరోనా విశ్వరూపం.. కొత్తగా 1018 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4234 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1018 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17357 కేసులు నమోదు కాగా, 267 మంది మృతి చెందారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జగన్ పార్టీలో మోస్ట్ పవర్ ఫుల్.. ఆ ముగ్గురే
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై పార్టీలో ఆసక్తికర చర్చకు తెర తీసింది. పార్టీలో జగన్ తర్వాత అత్యంత శక్తివంతమైన నేత ఎవరంటే.. అందరి చూపు విజయసాయి రెడ్డి మీద పడుతుంది. అధినేతకు అత్యంత దగ్గరగా ఉండటమేకాదు.. పార్టీ రచించే ప్రతి వ్యూహంలోనూ ఆయన కీలకభూమిక పోషించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పార్టీని మరింత బలోపేతం చేయటం కోసం తాజాగా ముగ్గురు ముఖ్యనేతలకు బాధ్యతలు అప్పజెప్పారు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
అమెరికాలో 50వేలు.. భారత్‌లో 19వేలు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1,08,03,559 కేసులు నమోదు కాగా.. 5,18,968 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 64,57,985 మంది కోలుకోగా.. 43,45,614 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘త్వరలోనే కలుద్దాం.. లేదా కలవకపోవచ్చు’ అంటూ పోస్టు పెట్టిన సుశాంత్ హీరోయిన్
సంజనా సంఘీ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుశాంత్ సింగ్ మరణం ఆమెను పూర్తిగా కలచివేసింది. సామాజిక మాధ్యమాల్లో సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక ఆమె ఏడ్చడం పలువురికి కంట నీరు తెప్పించింది. బుధవారం నాడు ఆమె తన సొంత ఊరైన ఢిల్లీకి వెళ్ళిపోయింది. ముంబైకు గుడ్ బై చెబుతూ ఓ నోట్ రాసుకు వచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి