తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4234 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1018 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ఏడుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 17357 కేసులు నమోదు కాగా, 267 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 881 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 33 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 36 కేసులు, మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. గ‌త ప‌ది రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 8082 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 9008 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 788 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.