ఎంతో మంది బ్యాట్స్‌మెన్లకు తన స్పిన్‌ బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు సక్లైన్ ముస్తాక్‌. పాకిస్థాన్‌ దిగ్గజ ఆటగాళ్లలో అతను ఒకడు. తాజాగా ముస్తాక్ ఓ సరదా సంఘటనను అభిమానులతో పంచుకున్నాడు. అది 1999 ప్రపంచకప్‌ సందర్భంగా జరిగిన ఘటన. కుటుంబ సభ్యులను ఇంటికి పంపాలని టోర్నీ మధ్యలో బోర్డు ఆదేశించినా.. తాను మాత్రం తన భార్యను బీరువాలో దాచి ఉంచిన విషయాన్ని బయటపెట్టాడు. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ రన్నరప్‌గా నిలిచింది.

‘1999 ప్రపంచకప్‌ ఇంగ్లాండ్‌లో జరిగింది. అప్పటికి నాకు పెళ్లి అయి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది. నా భార్య లండన్‌లోనే ఉండేది. పగలంతా ప్రాక్టీస్‌లో చేసి.. సాయంత్రాలు నా భర్యతో గడిపేవాడిని. అంతా సజావుగా సాగుతుందని బావిస్తున్న తరుణంలో బోర్డు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. ఆటోర్నీ మొదట్లో ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుతించిన బోర్డు.. ఆ తరువాత కుటుంబ సభ్యులను వెనక్కి పంపాలంటూ ఆదేశించింది. దీనిపై అప్పటి కోచ్‌తో మాట్లాడిన ప్రయోజనం లేకపోయింది. నా భార్యను పంపించి వేసినట్లు అబద్దం ఆడాను. అయితే.. మేనేజర్లు, కోచ్‌లు అప్పుడప్పుడు మా రూమ్‌లను తనిఖీ చేసేందుకు వచ్చేవారు. ఓ రోజు ఎవరో మా తలుపు కొట్టడం వినగానే వెంటనే నాభర్యను అల్మారాలో దాక్కోమన్నా.. అప్పుడు మేనేజర్‌తో పాటు మరో అధికారి వచ్చారు. అయితే.. వారికేమి అనుమానం రాలేదు. వాళ్లు వెళ్లిన తరువాత అజార్‌ మహమూద్‌, మహ్మమద్‌ యూసఫ్‌లు నాతో మాట్లాడటానికి వచ్చారు. నాతో పాటు గదిలో ఎవరో ఉన్నారనే అనుమానం వారికి కలిగింది. దీంతో చేసేది లేక నా భర్యను బయటకు రమ్మన్నాను. అయితే.. ఆ ఇద్దరు విషయాన్ని ఎవరికి చెప్పలేదు’ అని నాటి ఘటనను వివరించాడు ముస్తాక్. పాకిస్థాన్ తరుపున 49 టెస్టుల్లో 208 వికెట్లు, 169 వన్డేల్లో 288 వికెట్లు పడగొట్టాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort