హార్దిక్ ప్రేయసి.. బికినీ ఫోటో వైరల్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 July 2020 7:34 AM GMT
హార్దిక్ ప్రేయసి.. బికినీ ఫోటో వైరల్‌

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా కాబోయే భార్య, సినీ నటి నటాషా సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫోటో వైరల్‌గా మారింది. ఆమె ఓ త్రోబ్యాక్‌ బికినీ ఫోటోను షేర్‌ చేసింది. సముద్ర తీరాన బ్లాక్‌ బికినీలో కెమెరాకు ఫోజిచ్చింది ఈ సెర్బియా స్టార్‌. ఆ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 'దాని కింద నాకు కావాల్సింది మంచి విటమిన్‌ సీ(విటమిన్‌ సముద్రం)' అంటూ రాసుకొచ్చింది. కరోనా వైరస్ వల్ల ఇంటి నుంచి బయటకు వెళ్లని నటాషా తాను గతంలో బీచ్‌లో దిగిన బికినీ చిత్రాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.తనకు కావాల్సింది సముద్రమంటూ క్యాప్షన్ పెట్టి ఫొటోను పోస్టు చేయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బిగ్‌బాస్‌ 8తో వినోదరంగంలోకి అడుగుపెట్టిన నటాషా.. 'సత్యాగ్రహీ', 'పుక్రీ రిటర్న్స్' చిత్రాల్లో సెషల్ సాంగ్స్‌కు చిందులేసింది. నటిగా కంటే.. ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యా కాబోయే సతీమణిగానే ఎక్కువ మందికి తెలుసు. ఈ ఏడాది ఆరంభంలో నిశ్చితార్థం చేసుకుంది ఈ జంట. లాక్‌డౌన్‌లో తాము తల్లిదండ్రులను కాబోతున్నామని ప్రకటించారు. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని హార్దిక్‌ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. మొత్తం మీద కరోనా వేళ నటాషా పోస్టు చేసిన చిత్రం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Next Story