జీవీకే సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి, కుమారుడు సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు

By సుభాష్  Published on  2 July 2020 5:49 AM GMT
జీవీకే సంస్థ చైర్మన్ జీవీకే రెడ్డి, కుమారుడు సంజయ్‌రెడ్డిపై సీబీఐ కేసు నమోదు

జీవీకే గ్రూప్‌ సంస్థ చైర్మన్‌ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్‌ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదైంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కాంట్రాక్ట్‌ ఒప్పందంలో జీవీకే గ్రూప్‌ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది. అయితే 9 ప్రైవేటు కంపెనీలతో చేతులు కలిపి బోగస్‌ వర్క్‌ కాంట్రాక్టులు చూఏపించి రూ. 310 కోట్లు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. వీటిలో అధిక భాగం 2017-18మధ్య ముంబై విమానాశ్రయం చుట్టూ 200 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధికి వినియోగించినట్లు సీబీఐ పేర్కొంది. జీవీకే గ్రూప్‌ ప్రమోటర్లు తమ గ్రూప్‌ కంపెనీలకు ఆర్థిక సాయం చేసేందుకు మియాల్‌ రిజర్వు ఫండ్‌ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది.

జీవీకే గ్రూప్‌ చైర్మన్‌ వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జీవీ సంజయ్‌రెడ్డిలతో పాటు మియాల్‌, జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

RC0682020E0003 (2)

Next Story
Share it