విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తలొజా జైల్ నుంచి వీవీ భార్యకు జైలు సిబ్బంది ఫోన్ చేసి సమాచారం అందించారు. ప్రస్తుతం తలొజా జైల్లో ఉన్న హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నామని జైళ్ల శాఖ తెలిపింది. వరవరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు అరెస్ట్ అయ్యారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను లోయర్ కోర్టు కొట్టివేయగా.. మహారాష్ట్ర హైకోర్టులో బెయిల్ పిటీషన్‌‌ను వేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.