ప్రతి పేదకుటుంబానికి రూ.7500 సాయం చేయాలి : కోదండరామ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2020 7:32 AM GMT
ప్రతి పేదకుటుంబానికి రూ.7500 సాయం చేయాలి : కోదండరామ్‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.7500 ఆర్థిక సాయం చేయాలని కోరారు తెలంగాణ జన సమితి(తెజస) అధ్యక్షుడు కోదండరామ్‌. సీఎం సహాయనిధికి ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనా బాధితులను ఆదుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోదండరామ్‌ ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి రూ.7500 సాయం అందించాలన్నారు. సీఎం సహాయనిధికి ఎన్ని నిధులు వచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులపైనా స్పష్టత నివ్వాలని అన్నారు. ఇక రాష్ట్రంలో తప్పిదాలకు కేసీఆర్‌ పూర్తి బాధ్యత వహించాలన్నారు. మొత్తం వనరులను కొవిడ్‌ నిర్మూలనకు ఖర్చు చేయాలన్నారు. న్యాయం జరిగే వరకు కొవిడ్‌ నిర్మూలన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పేద ప్రజలను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణలో టెస్టుల సంఖ్యను పెంచమని కోరుతున్నప్పటికి ప్రభుత్వం వినిపించుకోవడం లేదన్నారు. కరోనా కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్లు ఎక్కడ పనిచేయడం లేదన్నారు. కరోనాతో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికి ప్రభుత్వం సిబ్బందిని నియంలేదని, కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్వం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎన్ని సార్లు కోరినప్పటికి ఫలితం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవని ముఖ్మమంత్రి మాట్లాడం సరికాదన్నారు. కరోనా సోకిన అందరికి గాంధీనే చికిత్స అందిస్తామని చెప్పి.. తెరాస ఎమ్మెల్యేలకు మాత్రం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారని విమర్శించారు. కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు భరోసా కల్పించాలని, ఆస్పత్రుల్లో వసతులను మెరుగుపరచాలన్నారు.

Next Story