'త్వరలోనే కలుద్దాం.. లేదా కలవకపోవచ్చు' అంటూ పోస్టు పెట్టిన సుశాంత్ హీరోయిన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 July 2020 10:13 AM GMT
త్వరలోనే కలుద్దాం.. లేదా కలవకపోవచ్చు అంటూ పోస్టు పెట్టిన సుశాంత్ హీరోయిన్

సంజనా సంఘీ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించిన ఆఖరి చిత్రం 'దిల్ బేచారా' సినిమాలో హీరోయిన్ గా నటించింది. సుశాంత్ సింగ్ మరణం ఆమెను పూర్తిగా కలచివేసింది. సామాజిక మాధ్యమాల్లో సుశాంత్ సింగ్ మరణాన్ని తట్టుకోలేక ఆమె ఏడ్చడం పలువురికి కంట నీరు తెప్పించింది. బుధవారం నాడు ఆమె తన సొంత ఊరైన ఢిల్లీకి వెళ్ళిపోయింది. ముంబైకు గుడ్ బై చెబుతూ ఓ నోట్ రాసుకు వచ్చింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తాను ఎయిర్ పోర్టులో ఉన్న ఫోటోను అప్లోడ్ చేసిన సంజనా

"Khuda hafiz, Mumbai. Chaar mahine baad apke darshan hue. Main chali Delhi vaapis. Aapki sadke kuch alag si lagi, sunsaan thi, shayaad mere dil mein jo dukh hai, mere nazariye ko badal rahe hain, ya shayaad filhaal aap bhi thode dukh mein hain" అంటూ పోస్టు పెట్టింది.

ముంబైకు వీడ్కోలు.. ముంబైను చూడడానికి నాలుగు నెలలు పట్టింది. ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతున్నాను. ముంబై వీధులు ముందులా అనిపించడం లేదు.. ఖాళీగా అనిపిస్తోంది. నా మనసులో ఉన్న బాధ వలన నాకు అలా కనిపిస్తూ ఉందేమో.. లేదా ముంబై కూడా ఆ బాధలోనే ఉందేమో.. అంటూ సుశాంత్ మరణం గురించి వ్యాఖ్యానించింది.

"Milte hain? Jaldi. Ya shayad, nahi" "త్వరలోనే కలుద్దామా? లేక ఇక రాలేనేమా" అంటూ చివరగా ఆమె రాసిన లైన్ కారణంగా ఆమె ముంబైకి మళ్లీ రావాలని అనుకోవడం లేదని తెలుస్తోంది.

సంజనా రణబీర్ కపూర్, నర్గిస్ ఫక్రీ హీరో హీరోయిన్లుగా నటించిన రాక్ స్టార్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చాలా యాడ్స్ లో ఆమె నటించింది. దిల్ బేచారా సినిమా ద్వారా హీరోయిన్ గా అవకాశం లభించింది. ఆమెను ముంబై పోలీసులు దాదాపు ఏడూ గంటల పాటూ విచారించారు. ఆ సినిమా చేస్తున్న సమయంలో సుశాంత్ మానసిక పరిస్థితి ఎలా ఉండేది లాంటి ఎన్నో విషయాలను ఆమె నుండి పోలీసులు సేకరించారు. దిల్ బేచారా సినిమాను త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల చేయనున్నారు. కానీ అభిమానులు మాత్రం సినిమా థియేటర్లు ఓపెన్ చేసే వరకూ ఆగాలని.. థియేటర్ లోనే సుశాంత్ ఆఖరి సినిమాను చూద్దామని కోరుతూ ఉన్నారు.

Next Story