న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

By Newsmeter.Network  Published on  5 Dec 2019 4:19 PM GMT
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

1. కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. న‌లుగురి మృతి

కృష్ణా జిల్లా నందిగామ‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. ఈ ఘటనలో నలుగురు యువ‌కులు మృతిచెందారు. డీసీఎం లారీని వేగంగా వ‌స్తున్న కారు ఢీకొన‌డంతో ఈ ప్రమాదం జ‌రిగింది. వివరాల్లోకెళితే.. నందిగామ నుంచి ఏపీ16డీబీ 5587 నెంబ‌ర్ గ‌ల కారులో న‌లుగురు యువ‌కులు విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు నందిగామ ద‌గ్గ‌ర‌లో అతివేగంగా డీసీఎంను ఢీ కొట్టింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

2. నిజ నిర్ధారణ: వాట్సాప్ లో గూగుల్ పే స్క్రాచ్ కార్డ్ తో నిజంగా డబ్బులు పొందవచ్చా??

డబ్బు లావాదేవీలను టెక్నాలజీ సులభతరం చేసింది. బ్యాంకుకు వెళ్లి క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా క్షణాల్లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. దేశంలో లావాదేవీలు చేసే ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయి యూపిఐ యాప్లు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు లాగా కాకుండా కేవలం స్మార్ట్ ఫోన్ తో అన్ని చేసేయొచ్చు. వేరు వేరు బ్యాంక్ అకౌంట్లను ఒకే మొబైల్ అప్లికేషన్ లోకి ఉంచి డబ్బు బదిలీ, ఆన్ లైన్ లావాదేవీలు చేయవచ్చు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

3. బీజేపీతో ‘కలిసుందాం రా’ పాట పాడుతున్న పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ ఇన్నాళ్లూ విమర్శించిన బిజెపీతో “కలిసుందాం రా” అన్న పాటను పాడబోతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇన్నాళ్లూ బీజేపీ కేవలం ప్రత్యేక హోదా అంశం విషయంలోనే దూరంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఒక విలేఖరి బీజేపీతో జనసేన విలీనం కాబోతుందా అని ప్రశ్నించినప్పుడు ఆయన అసలు మేము బీజేపీకి దూరం ఏనాడూ లేమని వ్యాఖ్యానించారు. బీజేపీతో కలిసే విషయం గురించి అడుగగా జనసేన భవిష్యత్తు గురించి తాను ఇప్పుడే చెప్పలేనని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని ఆయన అన్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

4. రైలు చివరి బోగీ వెనుక ఆంగ్ల అక్షరం X ఎందుకు ఉంటుందో తెలుసా..?

కొన్ని ప్రదేశాల్లో మనం వెళ్తుంటే కొన్ని మనకు తెలియని విషయాలు చాలా దిగివుంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోము. రైల్వే స్టేషన్‌కు వెళ్తే కొన్నింటిని మనం చూసినా… పెద్దగా పట్టించుకోము. ప్రతి ఒక్కరు కూడా రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండవు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. సాధారణంగా అందరు కూడా రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు ప్రయాణం చేస్తుంటారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

5. ఓబీసీ.. గుర్రం ఎక్కి పెళ్లి చేసుకుంటే తప్పా..?

నిమ్నకులంలో పుడితే డబ్బు, చదువు ఉన్నంత మాత్రాన గౌరవం రాదన్న విషయం అగర్ మాల్వాకి చెందిన ధర్మేశ్ పర్మార్ కి తెలిసి వచ్చింది. పెళ్లి ఊరేగింపులో గుర్రం మీద వస్తున్న పర్మార్ ను రాజపుత్ర అగ్రకులస్తులు కిందకి లాగి పారేశారు. వెనుకబడ్డ కులాల వారికి గుర్రమెక్కే అర్హత లేదంటూ ఆక్షేపించారు. తాము సామాజికంగా ఎదగడం.. పై మెట్లుఎక్కడం అగ్రకులాల వారికి ఇష్టం లేదని ఎంకామ్ బీఈడీ చదివిన పర్మార్ అన్నాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

6. పవన్ కళ్యాణే పెద్ద రేపిస్ట్ : వైసీపీ మ‌హిళా నేత‌

కాణిపాకం : వైసీపీ పూతలపట్టు నియోజకవర్గ ఎన్నిక‌ల ప‌రిశీల‌కురాలు శైలజా చ‌ర‌ణ్ రెడ్డి.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జ‌న‌సేనాని పవన్ కల్యాణే పెద్ద రేపిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక‌.. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ప‌వ‌న్‌ అడుకున్నారని.. మరెంతో మంది అమ్మాయిలను రేప్ చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ద‌ని ఆమె ఫైర్ అయ్యారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

7. రూ.2000 నోటును రద్దు చేయబోం..!

చెలామణిలో ఉన్న రెండువేల నోటు మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చెలామణి అవుతున్నా… రద్దు అవుతున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. అందుకు కేంద్రప్రభుత్వం కూడా వివరణ ఇచ్చుకుంది. రెండువేల నోట్లను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో స్పష్టతనిచ్చారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

8. ఫార్మసీ కంపెనీలకు ఎదురుదెబ్బ… ఇక ఆన్‌లైన్‌లో మందుల విక్రయం నిషేధం..!

ఈ-ఫార్మసీ కంపెనీలకు ఎదురు దెబ్బ తగిలింది. ఇకపై ఆన్‌లైన్‌లో మందుల బ్రేక్‌ పడింది. ఆన్‌లైన్‌లో మందులను విక్రయాలను నిలిపివేయాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ రెగ్యులేటర్‌ సంస్థ స్పష్టం చేసింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇ–ఫార్మసీ సంస్థలన్నీ తక్షణమే ఇంటర్నెట్‌లో మందుల విక్రయాన్ని నిలిపివేయాలని కోరినట్టు ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇ–ఫార్మసీ సంస్థల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనల్ని రూపొందిస్తోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

9. యూరేనియం స్మశానవాటికగా కడప జిల్లా..!

కడప జిల్లాలో భారత దేశంలోనే అతి పెద్ద యురేనియం గనులు త్వరలో రాబోతున్నాయి. ఇందులో రోజుకు ఆరు వేల టన్నుల యూరేనియం ఉత్పత్తి అవుతుంది. ఇప్పటివరకూ అత్యధిక పరిమాణంలో యూరేనియం ఉత్పత్తి చేస్తున్న తమ్మల పల్లి మైన్స్ కన్నా ఇది చాలా ఎక్కువ. తుమ్మలపల్లి మైన్స్ , దాని టెయిల్ పాండ్ ల తాలూకు సాటిలైట్ చిత్రాలను చూస్తే రానురాను కడప యూరేనియం స్మశానవాటిక గా మారబోతోందని సులువుగానే అర్థం అవుతుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

10. మందు బాబులకు జగన్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌..!

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మద్యంపై కీలక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏపీలో మద్యం షాపులను తగ్గించి మద్యనిషేదం దిశగా నిర్ణయం తీసుకుంటుంది జగన్ సర్కార్‌. గ్రామాల్లో బెల్టుషాపులను దశల వారిగా ఎత్తివేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. తాజాగా మందుబాబుకు సర్కార్‌ మరో షాకిచ్చింది. నియంత్రణలో భాగంగా మరికొన్ని చర్యలు చేపట్టనుంది. మద్యం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి …

Next Story