ముఖ్యాంశాలు

  • 2 వేలనోటును రద్దు చేయబోమన్న మంత్రి
  • రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం

చెలామణిలో ఉన్న రెండువేల నోటు మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో చెలామణి అవుతున్నా… రద్దు అవుతున్నట్లు చాలా పుకార్లు వచ్చాయి. అందుకు కేంద్రప్రభుత్వం కూడా వివరణ ఇచ్చుకుంది.  రెండువేల నోట్లను రద్దు చేయబోమని స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో స్పష్టతనిచ్చారు. చెలామణిలో ఉన్న రూ.2000 నోటు ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయబోమని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ప్రసుత్తం చెలామణిలో ఉన్న నగదులో రూ. 2000 విలువైన నోట్లు 31.18 శాతం ఉంటాయని, కాగా,  బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో దశలవారీగా రూ.2000 నోటును నిలిపేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? అన్న ఓ ఎంపీ అడిగిన ప్రశ్న కు అనురాగ్ ఠాకూర్ పై విధంగా సమాధానం ఇచ్చారు. ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి మొత్తం రూ.21,10,900 కోట్ల విలువ గల వివిధ నోట్లలో రూ.6,58,200 కోట్ల విలువైన రూ.2000 నోట్లు (31.18 శాతం) చలామణిలో ఉన్నాయని, ఆ నోట్లను ఎట్టి పరిస్థితుల్లో నిలిపివేయబోమని తేల్చి చెప్పారు.

ఐపీసీ, సీఆర్పీసీ నిబంధనల సవరణలపై కమిటీ వేశాం: అమిత్‌ షా

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)లలో సవరణలు తీసుకువచ్చేందుకు సూచనలు కోరుతూ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అలాగే మూకదాడుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలన్న విషయమై పలువురు సభ్యులు వేసిన ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం ఇచ్చారు. ఐపీసీ, సీఆర్పీసీల్లో తప్పనిసరిగా తేవాల్సిన సవరణలపై తమకు సిఫారసులు పంపాలని అన్ని రాష్ర్టాల సీఎంలు, గవర్నర్లకు లేఖలు రాసినట్లు చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసులు అందిన తర్వాత ఐపీసీ, సీఆర్పీసీలలో సవరణలపై తగు చర్యలు తీసుకుంటామని అమిత్‌షా అన్నారు. ఐపీసీ, సీఆర్పీసీలలో మార్పులు తేవాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని కమిటీని ఏర్పాటు చేశామన్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.