పవన్ కళ్యాణే పెద్ద రేపిస్ట్ : వైసీపీ మ‌హిళా నేత‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Dec 2019 9:28 AM GMT
పవన్ కళ్యాణే పెద్ద రేపిస్ట్ : వైసీపీ మ‌హిళా నేత‌

కాణిపాకం : వైసీపీ పూతలపట్టు నియోజకవర్గ ఎన్నిక‌ల ప‌రిశీల‌కురాలు శైలజా చ‌ర‌ణ్ రెడ్డి.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. జ‌న‌సేనాని పవన్ కల్యాణే పెద్ద రేపిస్ట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక‌.. మూడు పెళ్లిళ్లు చేసుకుని ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ప‌వ‌న్‌ అడుకున్నారని.. మరెంతో మంది అమ్మాయిలను రేప్ చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ ద‌ని ఆమె ఫైర్ అయ్యారు. రేప్ చేసిన వారిని ఉరి తిస్తే తన బండారం బయటపడి.. తనను కూడా ఉరి తిస్తారనే భయంతో.. రేప్ చేసిన వారి తరపున.. పవన్ వకాల్తా పుచ్చుకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర‌స్థాయిలో ద్వ‌జ‌మెత్తారు. ఇలాంటి వారివల్ల సమాజానికి తీరని నష్టం జరుగుతుందని.. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఉరి శిక్ష విధించాలని కోరారు.

అయితే.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ అత్యాచార ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. నిందితుల‌కు ఉరి అవసరం లేదని వారిని బెత్తంతో చెమ్డాలు ఊడేలా రెండు దెబ్బలేస్తే చాలని వ్యాఖ్యానించారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ శైలజా చ‌ర‌ణ్ రెడ్డి ఈ త‌రహా ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

Next Story
Share it