మందు బాబులకు జగన్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌..!

By Newsmeter.Network  Published on  5 Dec 2019 9:51 AM GMT
మందు బాబులకు జగన్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్‌..!

ఏపీలో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే మద్యంపై కీలక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏపీలో మద్యం షాపులను తగ్గించి మద్యనిషేదం దిశగా నిర్ణయం తీసుకుంటుంది జగన్ సర్కార్‌. గ్రామాల్లో బెల్టుషాపులను దశల వారిగా ఎత్తివేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. తాజాగా మందుబాబుకు సర్కార్‌ మరో షాకిచ్చింది. నియంత్రణలో భాగంగా మరికొన్ని చర్యలు చేపట్టనుంది. మద్యం విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. లిక్కర్‌కార్డులు ప్రవేశ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు వేలుగా ముందుగా చెల్లిస్తే లిక్కర్‌ కార్డులను జారీ చేయనున్నారు. కార్డులో డబ్బులు అయిపోగానే మళ్లీ 5 వేలతో రీచార్జ్‌ చేసుకోవల్సి ఉంటుంది. 25 ఏళ్లు నిండిన మెడికల్‌ సర్టిఫై చేసిన వారికే కార్డు జారీ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. కాగా, జగన్‌ తీసుకొచ్చిన నూతన మద్యం విధానం సత్ఫలితాలిస్తోంది. మద్య నియంత్రణ, నిషేధం దిశగా ఏపీ వేగంగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే మద్యం వినియోగం, విక్రయాలు గణనీయంగా తగ్గాయి.

తగ్గిన మద్యం విక్రయాలు :

జగన్‌ నిర్ణయంతో ఏపీలో మద్యం విక్రయాలు క్రమ క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2018 నవంబర్‌లో 29 లక్షల 62వేల కేసుల లిక్కర్‌ను విక్రయించగా.. ఈ సంవత్సరం నవంబర్‌లో 22లక్షల 31వేల కేసుల మద్యం మాత్రమే విక్రయం కొనసాగినట్లు తెలుస్తోంది. దీంతో 24.67 శాతం మేర మద్యం అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్‌లో 17లక్షల 80వేల కేసులు అమ్ముడుపోగా, ఈ సంవత్సరం నవంబర్‌లో 8 లక్షల 13వేల కేసులను మాత్రమే అమ్ముడయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో బీర్ల అమ్మకాల్లో తగ్గుదల 54.30 శాతంగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ వల్ల గతంలో ఉన్న 4380 మద్యం షాపులను 3500లకు తగ్గించారు. నూతన మద్యం పాలసీలో భాగంగా సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయాలతో అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది. కాగా, ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా పాటించడంతో మద్యం క్రమక్రమంగా నియంత్రణలోకి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేయడంతో మద్యం షాపులు కేవలం అమ్మకానికి పరిమితం అయ్యాయని అధికారులు చెబుతున్నారు. జగన్‌ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌, పోలీసు అధికారులు సమన్వయంతో బెల్ట్‌ షాపులను తొలగించడంతో గ్రామాల్లో మద్యం వినియోగం పూర్తిగా తగ్గిందని అధికారులు వివరించారు.

Next Story