కొన్ని ప్రదేశాల్లో మనం వెళ్తుంటే కొన్ని మనకు తెలియని విషయాలు చాలా దిగివుంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోము. రైల్వే స్టేషన్‌కు వెళ్తే కొన్నింటిని మనం చూసినా… పెద్దగా పట్టించుకోము. ప్రతి ఒక్కరు కూడా రైలు ప్రయాణం చేసే ఉంటారు. కానీ కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండవు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

సాధారణంగా అందరు కూడా రైల్వే స్టేషన్ కు వెళ్లి రైలు ప్రయాణం చేస్తుంటారు. రైల్వే స్టేషన్ కు వెళ్లినప్పుడు రైలు బోగీలను జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. ప్రధానంగా రైలు చివరి బోగి వెనుక భాగంలో ఆంగ్ల అక్షరం X అని పెద్దగా రాసి ఉంటుంది. దాని పెద్దగా ఎవరు గమనించి ఉండరు. అసలు అలా X అని ఎందుకు రాసి ఉంటుందో చాలా మందికి తెలియదు.

రైలు బోగీల్లో చివరి బోగీ వెనుక X అని రాసి ఉంటే ఆ రైలుకు ఆ పెట్టే చివరిది అని అర్థం. అంతే కాదు… ఆ X అక్షరం కిందే ఓ ఎర్రని లైటు వెలుగుతూ ఉంటుంది. అలాగే దాని పక్కనే LV అనే ఓ బోర్డు కూడా తగిలించబడి ఉంటుంది. ఇవన్నీ X అక్షరం లాగే ఉపయోగపడతాయి. వీటి వల్ల రైలుకు ఉన్న ఆ పెట్టెను చివరి పెట్టెగా పరిగణిస్తారు రైల్వే సిబ్బంది. X అక్షరం పగటి సమయంలో ఉపయోగపడితే, ఎర్రని లైటు రాత్రి పూట ఉపయోగపడుతుందట. దీని వల్ల వాటిని చూసే వారు ఆ రైలు అన్ని బోగీలతోనే వెళ్తుందని అర్థం చేసుకుంటారు. ఒక వేళ రైలు చివరి బోగికి ఈ అక్షరాలు ఏవీ లేకపోతే అది ప్రమాదవశాత్తూ కొన్ని బోగీలు లేకుండానే నడుస్తుందని తెలుసుకుంటారు రైల్వే సిబ్బంది. దీంతో వెంటనే అప్రమత్తమై సంబంధిత అధికారులకు తెలియజేస్తారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.