Newsmeter టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 26 Aug 2020 12:26 PM GMTఓ వైపు పశ్చాత్తాప వ్యాఖ్యలు.. మరో వైపు కుటిల ప్రయత్నాలు
భారత్‌పై అధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలు చేస్తూ, సరిహద్దుల్లో సైనిక సంపత్తిని మోహరిస్తూ మరో వైపు భారత్‌పై ముసలి కన్నీరు కారుస్తోంది చైనా. భారత్ – చైనా సరిహద్దులో గల్వాన్ ఘటనలో 20 మంది సైనికులు మరణించడం దురదృష్టకర సంఘటనగా అభివర్ణించింది చైనా. ఘటన జరిగిన రెండు నెలల తర్వాత చైనా పశ్చాత్తాప వ్యాఖ్యలు చేయడం గమనార్హం... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
చిన్న అనుమానం.. ఆ మృతదేహాన్ని మోయడానికి ‘ఆ నలుగురు’ కరువు
కరోనా మహమ్మారి మానవ సంబంధాలను మరింత దూరం చేస్తోంది. వైరస్ సోకిందనే అనుమానం వచ్చినా చాలు.. సొంతవాళ్లు, ఇరుగుపొరుగు వాళ్లు సైతం ప్రాణం పోతుందన్నా పట్టించుకోని పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో అలాంటి హృదయ విధారక ఘటనే చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామంలో తలారి సత్తెమ్మ మృతదేహాన్ని మోయడానికి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రెండో సారి కరోనా సోకడంపై క్లారిటీ ఇచ్చిన సీసీఎంబీ డైరెక్టర్
ప్రపంచ వ్యాప్తంగా కరోనా అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వైరస్ వ్యాప్తి వేగంగా పెరిగిపోతోంది. చాలా మంది వైరస్ గురించి లేనిపోని అపోహాలు పెట్టుకొంటూ భయాందోళన చెందుతున్నారు. ఈ భయానికే కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారు. వైరస్ సోకగానే ఏదో అయిపోతుందన్నట్లు, ఇక బతకమేమో అన్నట్లు భయాందోళనకు గురవుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ రికార్డు సాధించిన ఏకైన ఫాస్ట్ బౌలర్.. కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు..!
టెస్టుల్లో 600 వికెట్ల మైలు రాయిని చేరుకోవడం అంటే గొప్ప ఘనత. ఆ రికార్డును జేమ్స్ ఆండర్సన్ అందుకున్నాడు. పాకిస్థాన్ తో సౌతాంఫ్టన్ లో ముగిసిన మూడో టెస్టులో ఆ జట్టు కెప్టెన్ అజర్ అలీ వికెట్ తీసిన జేమ్స్ ఆండర్సన్ 600 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో అయిదు వికెట్లు తీసిన ఆండర్సన్.. సెకండ్ ఇన్నింగ్స్ లో అబిద్ అలీ, అజర్ అలీల వికెట్లు తీసి 600 వికెట్లు సాధించాడు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లపై కొరఢా.. ఐదు ఆస్పత్రుల అనుమతులు రద్దు..!
విజయవాడ స్వర్ణప్యాలెస్ ఘటన నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రులపై ఏపీ సర్కార్ కొరఢా ఝులిపిస్తోంది. అనుమతులు, సౌకర్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలోని విజయవాడతో పాటు పలు చోట్ల ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్ల ఆగడాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుంది. విజయవాడలో ఐదు ప్రైవేటు కోవిడ్ కేర్ సెంటర్లకు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నిలిచిపోయిన రూ. 2వేల నోట్ల ముద్రణ
గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2వేల నోట్ల ముద్రణ నిలిచిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తమ వార్షిక నివేదికలో వెల్లడించింది. అలాగే రెండువేల నోటు చలామణి కూడా మూడేళ్లుగా క్రమంగా తగ్గిపోయిందని స్పష్టం చేసింది. 2018, మార్చి 31 నాటికి చలామణిలో 33,632 లక్షల రెండువేల నోట్లండగా, 2019, మార్చి 31 నాటకి ఇవి .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ బాలుడు మృత్యుంజయుడు.. శిథిలాల కింద 18 గంటలు
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కూలిన ఆ భవనం శిథలాల కింద 18 గంటల పాటు ఉన్న ఆ బాలున్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. రాయ్‌గఢ్ జిల్లా మహడ్ ప్రాంతంలో సోమవారం రాత్రి పది సంవత్సరాల నాటి భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కోవిడ్ సామాన్యుల రాజకీయ నాయకులు, పోలీసులు, సెలబ్రిటీలు ఇలా వైరస్ ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణమూర్తి మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. కరీంనగర్‌లోని.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఇస్మార్ట్ భామ మనసు దోచుకునేవాడు అలా ఉండాలట
రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రం విజయం సాధించడంతో హీరోయిన్ నభా నటేష్ కు మంచి పేరు వచ్చింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఇస్మార్ట్ శంకర్ కంటే ముందు ‘నన్ను దోచుకుందువటే’ సినిమా చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఇక అమ్మడు అందాల ఆరబోతకు కూడా తెలుగు ప్రేక్షకులకు సెగలు పుట్టించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తమన్నా తల్లిదండ్రులకు కరోనా
నటి తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తమన్నా తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. గత కొద్దిరోజులుగా తన తల్లిదండ్రులలో కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో తాము కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపింది తమన్నా. అయితే దురదృష్టవశాత్తూ తన తల్లిదండ్రులకు కోవిద్-19 పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి