ఇస్మార్ట్ భామ మనసు దోచుకునేవాడు అలా ఉండాలట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Aug 2020 12:08 PM GMT
ఇస్మార్ట్ భామ మనసు దోచుకునేవాడు అలా ఉండాలట

రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌'. ఈ చిత్రం విజయం సాధించడంతో హీరోయిన్‌ నభా నటేష్ కు మంచి పేరు వచ్చింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఇస్మార్ట్ శంకర్‌ కంటే ముందు 'నన్ను దోచుకుందువటే' సినిమా చేసింది ఈ కన్నడ బ్యూటీ. ఇక అమ్మడు అందాల ఆరబోతకు కూడా తెలుగు ప్రేక్షకులకు సెగలు పుట్టించింది. మీ మనసు దోచుకోవాలంటే ఏం చేయాలని అడిగితే.. నభా చెప్పిన విషయాలను విని అభిమానులతో పాటు అందరూ షాక్ అయ్యారు.

తనకు కాబోయే వాడు జోవియల్‌గా ఉండాలట. అంతేకాదు తనకు జోక్స్‌తో నవ్వించే వాడేతైనే చేసుకుంటానని చెబుతోంది. ఇంకా సున్నితత్వం ఉండాలట. 'ఎదుటి వాళ్ల ఆలోచనల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకుని నడుచుకునే వాళ్లంటే చాలా ఇష్టం. అలా నా జీవితంలోకి ఒకరొచ్చారు. ఆయన పేరు షారుఖ్‌ ఖాన్‌. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ అభిమానం పెంచుకున్నా. కుచ్‌ కుచ్‌ హోతా హై ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. స్కూల్‌, కాలేజీ వయసులో ఆక్షరణ ఉంటుంది కదా..! అలా షారుఖ్‌ మాయలో పడిపోయానంతే' అంటోంది ఇస్మార్ట్ భామ. ఇక ఆయనతో నటించే ఛాన్స్‌ వస్తే ఒదులుకునే ప్రసక్తే లేదంటోంది. ప్రస్తుతం తెలుగులో ఆమె 'సోలో బ్రతుకే సో బెటర్'‌, 'అల్లుడు అదుర్స్‌' చిత్రాల్లో నటిస్తోంది. నిర్మాతలు కూడా నభా డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే నభా నటేష్ తెలుగులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాతో పాటు.. అల్లు అర్జున్ సుకుమార్ సినిమాతో పాటు రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ‌లో ఈమె పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read

Next Story