తమన్నా తల్లిదండ్రులకు కరోనా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 9:33 AM GMT
తమన్నా తల్లిదండ్రులకు కరోనా

నటి తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తమన్నా తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది. గత కొద్దిరోజులుగా తన తల్లిదండ్రులలో కరోనా లక్షణాలు కనిపించాయని.. దీంతో తాము కరోనా టెస్టులు చేయించుకున్నట్లు తెలిపింది తమన్నా. అయితే దురదృష్టవశాత్తూ తన తల్లిదండ్రులకు కోవిద్-19 పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది.

అధికారులను తాము సంప్రదించామని.. తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది తమన్నా..! ఇక తన టెస్టు రిజల్ట్స్ కూడా వచ్చాయని.. తనకు నెగటివ్ వచ్చిందని తెలిపింది. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా నెగటివ్ అంటూ స్పష్టం చేసింది తమన్నా. తన తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకోవాలని దేవుళ్లను ప్రార్థిస్తున్నానని తెలిపింది.

తమన్నా ప్రస్తుతం గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్‌తో మరో సినిమాలో నటించనుంది. కన్నడంలో హిట్ అయిన ‘లవ్‌ మాక్‌టైల్‌’ మూవీ తెలుగు రీమేక్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు నాగశేఖర్‌ దర్శకత్వం వహించనున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ మూవీకి సంగీతం అందించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తోంది తమన్నా. సెప్టెంబర్ నుంచి తమన్నా సినిమా షూటింగ్ లో పాల్గొనాలని భావిస్తున్న తరుణంలో ఆమె తల్లిదండ్రులకు కరోనా మహమ్మారి సోకింది.

Next Story