కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి

By సుభాష్  Published on  26 Aug 2020 3:59 AM GMT
కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కోవిడ్‌ సామాన్యుల రాజకీయ నాయకులు, పోలీసులు, సెలబ్రిటీలు ఇలా వైరస్‌ ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణమూర్తి మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దక్షిణమూర్తి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ నెలాఖరులో ఆయన పదవీ విరమణ పొందనున్నారు.

1989 బ్యాచ్‌కు చెందిన దక్షిణమూర్తి వరంగల్‌ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పని చేశారు. మావోయిస్టుల ఆపరేన్స్‌తో పాటు వరంగల్‌లో సంచలనం సృష్టించిన యాసిడ్‌ దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్లో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే కరీంనగర్‌ సవారాన్‌ స్టీట్‌ కు చెందిన దక్షిణ మూర్తి జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్‌ ఎస్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలై పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరిన సమయంలో వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆయన మృతితో జిల్లా పోలీస్‌ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story