న్యూస్‌ మీటర్‌ .. టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  12 Dec 2019 9:41 PM IST
న్యూస్‌ మీటర్‌ .. టాప్‌ 10 న్యూస్‌

1. మాకు మేమే.. మీకు మీరే..!

ఒకవైపు తమ్ముడు పవన్ కల్యాణ్ జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాకినాడలో దీక్ష చేస్తుంటే, మ‌రో వైపు పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాత్రం జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి అంటే ఎంతో గౌర‌వం. ఆయ‌న గురించి చాలా స‌భ‌ల్లో ఎన్నో విష‌యాలు చెప్పుకొచ్చారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. ప‌డిలేచిన కెర‌టం త‌ను.. నిలిచి గెలిచిన‌ వ్య‌క్తిత్వం త‌ను..!

‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే.. నిబిడాశ్చర్యంతో వీరు.. నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే.. నిర్దాక్షిణ్యంగా వీరే’ ఇంత‌టి ప‌దునైన మాట‌లు మ‌హాక‌వి శ్రీశ్రీ ఎవ‌రి కోసం, ఎవ‌రినుద్దేశించి అన్నారో కానీ.. ఈ మాట‌లు క‌చ్చితంగా ఇండియ‌న్ క్రికెటర్ యువ‌రాజ్‌ సింగ్‌కు మాత్రం వ‌ర్తిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి.

3. ‘గ‌వ‌ర్న‌ర్’ ప‌ర్య‌ట‌న వెనుక ఆంత‌ర్య‌మేంటీ..?

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజ‌న్‌ రాజ్‌భ‌వ‌న్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ అంటే ఇలా ఉండాలి అని తమిళ్ సై సీఎం కేసీఆర్ ప్రభుత్వంకు చూపేలా ఉన్నట్లు కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. బిగ్‌బ్రేకింగ్ : గొల్ల‌పూడి మారుతీరావు క‌న్నుమూత‌

సాహితీవేత్త, ప్ర‌ముఖ న‌టుడు, జ‌ర్న‌లిస్ట్, ర‌చ‌యిత గొల్ల‌పూడి మారుతీరావు క‌న్నుమూశారు. గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న చైన్నైలోని ఓ ప్ర‌వైట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కొద్ద‌సేప‌టి క్రిత‌మే మృతిచెందారు. 1939 ఏప్రిల్ 14న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌న్మించిన గొల్ల‌పూడి.. సినిమాల్లోకి రాక‌ముందు ఆకాశ‌వాణిలో ప‌నిచేసేవారు. ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య సినిమా ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసిన ఆయ‌న సుమారు 290 సినిమాల్లో న‌టించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. వృద్ధులను వేధిస్తే.. ఊచలు లెక్కపెట్టాల్సిందే..!

ఢిల్లీ: కేంద్రప్రభుత్వం మరో బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. వృద్ధులను వేధింపులకు గురి చేసినా, దుర్భాషలాడినా, వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకపోయినా ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా లేదంటే రెండు విధించేలా బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. బుధవారం కేంద్రమంత్రి తావర్‌చంద్‌ గెహ్లోత్‌ ‘తల్లిదండ్రుల సంక్షేమం- సీనియర్‌ సిటిజన్ల చట్టం-2007’ సవరణ బిల్లను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం వృద్ధులు తమ జీవనం కోసం పోషణ ఖర్చును అడిగే హక్కుంటుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. ఆ పెద్దమనిషికి బుద్ధి లేదు.. అదొక చెత్త పేపర్

అమరావతి : గురువారం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు అధికార పక్ష నేతకు, ప్రతిపక్ష నేతకు మధ్య మీడియాకు సంబంధించి మాటల యుద్ధం జరిగింది. జగన్ కు సంబంధించిన సాక్షి పేపర్ లో తనపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తున్నారని, తాను అనని మాటలు కూడా అన్నానని రాసుకొచ్చారని చంద్రబాబు మాట్లాడుతుండగా జగన్ ఆయనపై ఫైర్ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. వాంఖ‌డే వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన రికార్డులు..!

టీమిండియా, విండీస్ జ‌ట్ల మ‌ధ్య‌ వాంఖడే వేదిక‌గా జ‌రిగిన చివ‌రిదైన మూడో టీ20లో బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో టీమిండియా బ్యాట్స్‌మెన్ పలు రికార్డులు నమోదు చేయగా.. విండీస్ జ‌ట్టు మాత్రం కొన్ని చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంది. అవేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. విమానం సీట్ల కింద 14 కిలోల బంగారం ప‌ట్టివేత‌

మరోసారి శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అధికారుల క‌ళ్లు గ‌ప్పి భారీ మొత్తంలో బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఘ‌ట‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. అధికారులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా.. అక్ర‌మ బంగారం త‌ర‌లింపున‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌టం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. ఏపీలో మరణ మృదంగం.. రెండ్రోజుల్లో 8 మంది మృతి..!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి సమీపంలోని కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు పొదిలిలొని ఆస్పత్రికి తరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. కాకినాడలో పవన్ ‘రైతు సౌభాగ్య దీక్ష’

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం ఉదయం 8 గంటలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టారు. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన ఈ దీక్షలో నాగబాబు, నాదెండ్ల మనోహర్, పార్టీ సభ్యులు, జనసైనికులు పాల్గొన్నారు. దీక్ష ప్రాంగణానికి చేరుకోగానే మహిళలు పవన్ కు హారతినిచ్చి స్వాగతం పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story