ఏపీలో మరణ మృదంగం.. రెండ్రోజుల్లో 8 మంది మృతి..!

By అంజి  Published on  12 Dec 2019 8:41 AM GMT
ఏపీలో మరణ మృదంగం.. రెండ్రోజుల్లో 8 మంది మృతి..!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తపల్లి సమీపంలోని కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు పొదిలిలొని ఆస్పత్రికి తరించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్నాటకలోని బాళ్లారి వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శ్రీశైల దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. లారీ డ్రైవర్‌ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు వాహనరాకపోకలను చక్కదిద్దారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున రామపూరం మండలం కోండావాండ్లపల్లి దగ్గర జాతీయ రహదారిపై ఇన్నోవాను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రొద్దుటూరులో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు రాయచోటికి చెందిన అర్షద్, హజీరాలుగా, చిత్తూరు జిల్లా కలికిరి మండలానికి చెందిన హరూన్‌ భాషా, అఫిరాలుగా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Next Story
Share it