న్యూస్‌ మీటర్‌ .. టాప్‌ 10 న్యూస్‌

By సుభాష్  Published on  11 Dec 2019 4:08 PM GMT
న్యూస్‌ మీటర్‌ .. టాప్‌ 10 న్యూస్‌

1. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా స‌భ కొన‌సాగ‌డానికి వీల్లేదు..!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు మూడో రోజు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. టీడీపీ, వైసీపీ స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం ఉద్దేశించి టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు స‌భ్యుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదానికి తెర‌లేపాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. గజ్వేల్‌ అభివృద్ధికి మోడల్ కావాలి: సీఎం కేసీఆర్‌..!

సిద్దిపేట: సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. బుధవారం పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గజ్వేల్‌ పట్టణంలో నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ మార్కెట్‌లో మొత్తం ఆరు బ్లాక్‌లు ఉన్నాయి. ఆరున్నర ఎకరాల్లో నిర్మించిన ఈ మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

3. కేంద్రంపై కేసీఆర్‌ యాక్షన్‌ ప్లాన్‌ ఇదేనా..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికి తెలియని పరిస్థితి. కాగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ పోరుకి సిద్ధం అవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. తెలంగాణ సమస్యలను మోదీ సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని, ఇక తాడోపేడో తేల్చుకునేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

4. మరో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపిన జగన్‌ సర్కార్‌

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలన పరంగా తనదైన వేసుకుంటున్నారు. మహిళలకు అండగా నిలిచేందుకు మరో చరిత్రాత్మక బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలు,హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో మహిళల భద్రతపై ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. శాంసన్‌కు షాకిచ్చిన సెల‌క్ట‌ర్లు.. గాయ‌ప‌డిన ధవ‌న్ స్థానంలో..

విండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బీసీసీఐ జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే పెద్ద‌గా మార్పులు ఏమి చేయ‌ని సెల‌క్ష‌న్ క‌మిటీ.. సంజూ శాంస‌న్‌కు మాత్రం షాకిచ్చింది. గాయం కార‌ణంగా టీ20 సిరీస్‌కు దూర‌మైన ఓపెన‌ర్ ధవన్‌ స్థానంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అయితే.. వన్డే సిరీస్‌కు కూడా శాంసన్‌నే తిరిగి ఎంపిక చేస్తారని అందరూ భావించారు. అయితే శాంస‌ప్‌కు షాకిస్తూ.. మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. చెల‌రేగి ఆడుతున్న టీమిండియా ఓపెన‌ర్లు.. స్కోరెంతంటే..

ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియా, విండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 కొద్దిసేప‌లి క్రిత‌మే ప్రారంభ‌మ‌య్యింది. టాస్ గెలిచిన విండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భార‌త ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. వీరిద్ద‌రి విజృంభ‌న‌తో భార‌త్ స్కోరు 8వ ఓవ‌ర్ల‌నే 100 ప‌రుగులు దాటింది. సిక్సులు, ఫోర్ల‌తో చెల‌రేగిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. మీరు ఇప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కాను..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఈ చిత్రం టీజర్ ఈ రోజు నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. నారా లోకేష్‌పై ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఇటు టీడీపీ నేతలు, అటు వైసీపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటున్నారు. మేమంటే మేము అన్నట్లు ఒకరిపై ఒకరు నిందారోపణలకు దిగుతున్నారు. నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా అటు చంద్రబాబు, నారా లోకేష్‌లపై మండిపడిపోతున్నారు. చంద్రబాబు, లోకేష్‌లపై రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. టీఆర్ఎస్ పాలనకు ఏడాది పూర్తి.. సాధించిన ఘనత ఏంటి?

వరసగా రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నత్తనడకన సాగుతున్నట్లే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత వేగంగా వాటిని ఆచరణలో పెట్టలేకపోతుందంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. ప్ర‌తిష్టాత్మ‌క ‘పౌరసత్వ సవరణ బిల్లు’కు రాజ్యసభ ఆమోదం

బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన‌ ‘పౌరసత్వ సవరణ బిల్లు’కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. స‌భ‌లో మెజార్టీ సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటెయ్య‌డంతో ‘పౌరసత్వ సవరణ బిల్లు-2019’ ఆమోదం పొందినట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇదివ‌ర‌కే.. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story
Share it