విండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బీసీసీఐ జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే పెద్ద‌గా మార్పులు ఏమి చేయ‌ని సెల‌క్ష‌న్ క‌మిటీ.. సంజూ శాంస‌న్‌కు మాత్రం షాకిచ్చింది. గాయం కార‌ణంగా టీ20 సిరీస్‌కు దూర‌మైన ఓపెన‌ర్ ధవన్‌ స్థానంలో సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అయితే.. వన్డే సిరీస్‌కు కూడా శాంసన్‌నే తిరిగి ఎంపిక చేస్తారని అందరూ భావించారు. అయితే శాంస‌ప్‌కు షాకిస్తూ.. మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు.

రెగ్యుల‌ర్ వికెట్ కీప‌ర్ రిషభ్‌ పంత్‌కు బ్యాకప్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఉండటంతో, ప్ర‌త్నామ్న‌య‌ ఓపెనర్ గా కర్ణాటక ఆట‌గాడు మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. దీంతో ఎంతోకాలంగా టీమిండియాలో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న శాంస‌న్‌కు మ‌రోమారు నిరాశ త‌ప్ప‌లేదు. ఇక‌ సెల‌క్ట‌ర్లు ఈ ఒక్క మార్పు త‌ప్పించి వన్డే జట్టులో ఎలాంటి మార్పులు చేయ‌లేదు.

కాగా, మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఈనెల 15న చెన్నై, రెండో వన్డే 18న విశాఖపట్నం, మూడో వన్డే 22న కటక్‌లో జరుగనున్నాయి.

భారత వన్డే జట్టు:
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌, శివమ్‌ దూబే, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, దీపక్‌ చహర్‌, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.