మీరు ఇప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్ట‌ర్ ఎక్కాను..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఈ చిత్రం టీజర్ ఈ రోజు నాలుగు గంటల ఐదు నిమిషాలకు సామాజిక మాధ్యమం లో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. టీజర్ విడుదల అయిన ఏడు నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

తెలుగులో ఇది మొదటిసారని చెప్పుకోవచ్చు. స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ టీజర్,వారి ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ టీజర్ లో “నువ్వు ఇప్పుడే కార్ దిగావ్, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా” అని చెప్పే డైలాగ్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కాంబినేషన్ లో ఈ అల వైకుంఠపురంలో చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్