పాపం బాలయ్యకి ఇది నిజంగా అవమానమే..!

By Newsmeter.Network  Published on  11 Dec 2019 11:00 AM GMT
పాపం బాలయ్యకి ఇది నిజంగా అవమానమే..!

నటసింహం బాలయ్య హీరోగా సీనియర్ డైరెక్టర్ కె.ఎస్‌.రవికుమార్‌ డైరెక్షన్ లో వస్తోన్న 'రూలర్' సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య సినిమా పై ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో బజ్ రావడంలేదట. ఫ్యాన్స్ తో పాటు మాస్ కి కనెక్ట్ అయ్యేలా టీజర్ ను పవర్ ఫుల్ గా కట్ చేసి వదిలినప్పటికీ.. టీజర్ లో ఎక్కువుగా రొటీన్ బోరింగ్ యాక్షన్ ఉండటం.. పైగా అలాంటి బిల్డప్ యాక్షన్ షాట్స్ లో బాలయ్య బాబును చూసి చూసి బాగా బోర్ కొట్టడంతో సినిమా పై బజ్ రాకుండా పోయింది. దీనికి తోడు రొటీన్ కథ.. ముఖ్యంగా సమాజంలో అన్యాయం జరగడం.. దాంతో మన బాలయ్య బాబు రెచ్చిపోయి తెగ నరికి ఆ అన్యాయాన్ని అరికట్టడం ఇలాంటి పరమ రొట్ట కొట్టుడు సినిమాలకు ఇకనైనా నటసింహం ఎండింగ్ కార్డు ఇవ్వకపోతే కష్టమే. హిట్ మాట తర్వాత సంగతి, ఇక నుండి బాలకృష్ణ సినిమాలకు మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రావనేది కాదనలేని నిజం. దానికి ఉదాహరణనే ఇప్పుడు రూలర్ పరిస్థితి.

అన్నిటికి మించి డిసెంబర్ 20న మరో చిత్రం “ప్రతిరోజూ పండగే” పోటీలో ఉండటంతో రూలర్ స్థితి మరి దారుణంగా ఉంది. కలెక్షన్స్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ''ప్రతిరోజూ పండగే” సినిమాకి ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. దానికితోడు ఈ సినిమా పల్లెటూరి నేపథ్యంలో సాగే పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో సాయి తేజ్ సరసన గ్లామర్ డాల్ రాశి ఖన్నా నటిస్తోంది. ఏమైనా మొత్తానికి 'ప్రతిరోజూ పండగే' ముందు రూలర్ నిలబడటం కష్టమే. పాపం బాలయ్యకి ఇది నిజంగా అవమానమే.

Next Story
Share it