'నయనతార'కు ఇంకెన్ని సార్లు పెళ్లి చేస్తారు ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Dec 2019 3:38 PM GMT
నయనతారకు ఇంకెన్ని సార్లు పెళ్లి చేస్తారు ?

లేడీ సూపర్ స్టార్ గా నయనతార చూపించే స్టార్ డమ్ దెబ్బకు నిర్మాతలు ఆమె రోల్స్ ను లేపేస్తున్నారు. దీనికితోడు ఈ ముదురు భామ వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటుంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న నయన్ ఆ ప్రేమ మత్తును ఫుల్ గా ఎంజాయ్ చేద్దామనుకుంటే.. తమిళ్ మీడియా మాత్రం తెగ డిస్టర్బ్ చేస్తోందట. నయన్ - శివన్ ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉన్నా.. వీరిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారని ఇప్పటికే అనేకసార్లు వార్తలు రాశారట, ఆ వార్తలు అబద్దం అని, అయినా నాకు ఎన్ని సార్లు పెళ్లి చేస్తారు అని తమిళ్ మీడియా పై నయనతార ఫైర్ అవుతుందట.

మరి ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తూ.. ఎంజాయ్ చేస్తుంటే మీడియా మాత్రం ఆ వార్తలు రాయకుండా ఎందుకు ఉంటుంది. ఏది ఏమైనా నయన్ - శివన్ వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పడే సమయం ఆసన్నమైందని గత కొన్ని రోజులుగా కోలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లికి నయన్ తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ తెగ తొందరపెడుతున్నారట. పాపం మనోడు ఎంత తొందర పెట్టినా.. నయన్ మాత్రం ఇంకా ఒకే చెప్పడం లేదట. కలిసి తిరగడం పై ఉన్న ఇంట్రస్ట్ పెళ్లి మీదకు లేకుండా పోయింది నయనతారకు. ఇక నయనతార మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వచ్చిన 'సైరా'లో సిద్దమ్మ పాత్రలో కనిపించి ఎప్పటిలాగే తన నటనతో తన లుక్స్ తో ఆకట్టుకుంది.

Next Story
Share it