న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 9 Dec 2019 9:55 PM IST1. ఉరి తాళ్లు సిద్ధం చేయండి: సుప్రీం కోర్టు
నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరివేసేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 2012 డిసెంబర్ 15న నిర్భయ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు ఏడేళ్లవుతున్నా.. నిందితులకు ఎలాంటి శిక్ష వేయలేదు. ఆరుగురు నిందితులు నడుస్తున్న బస్సులో నిర్భయపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పట్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అందులో ఒక నిందితుడు జైలులోని ఆత్మహత్యకు పాల్పడగా, మరో నిందితుడిని మైనర్‌గా భావించి జైలుశిక్ష విధించి బాలనేరస్థుల జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
2. ఆ ఉరితాళ్లు ఎక్కడ తయారు చేస్తున్నారో తెలుసా..?
2012, డిసెంబర్ 15న ఢిల్లీలో చోటు చేసుకున్న నిర్భయ ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడనుంది. ఈనెల 16న ఉరిశిక్షను వేసేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు బీహార్‌లోని బుక్సర్ సెంట్రల్ జైలు అధికారులు ఆదేశాలు జారీ చేసింది. దోషులను ఉరి తీయడం కోసం బీహార్ రాష్ట్ర బుక్సర్ జైలు ఖైదీలు ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013 ఫిబ్రవరి 9వతేదీన ఉరి తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
3. కోహ్లీ వన్‌డౌన్‌లో రాకుండా.. దూబేను ఎందుకు పంపాడంటే..?
విండీస్ తో జరిగిన రెండవ టీ20లో శివమ్ దూబే తన బ్యాటింగ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కోహ్లీ రావాల్సిన మూడో స్థానంలో వచ్చిన దూబే.. ఆకట్టుకున్నాడు. అయితే.. దూబేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి గల కారణాలను మ్యాచ్ అనంతరం కోహ్లీ తెలిపాడు. కోహ్లీ మట్లాడుతూ.. తిరువనంతపురం గ్రీన్‌ఫీల్డ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని బ్యాటింగ్ ఆర్డర్‌లో దూబేను ముందు పంపి.. స్పిన్నర్లపై దాడికి దిగాలని భావించాం. అందుకే దూబేను మూడో స్థానంలో పంపాం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
4. ‘గన్’ కంటే ముందు జ’గన్’ : ఎమ్మెల్యే రోజా
ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వాడి-వేడీగా చర్చ జరిగింది. మహిళకు భద్రత అంశంపై సభలో చర్చకు సిద్ధం కాగా, ఉల్లి ధరలపై చర్చించాలని టీడీపీ నేతలు పట్టుబట్టింది. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. సభలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై స్పీకర్ మండిపడ్డారు. ఇక చర్చలో ఎమ్మెల్యే రోజు మాట్లాడారు. టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్‌లను టార్గెట్ గా చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
5. అత్యాచారాలపై సీఎం యోగి సంచలన నిర్ణయం
సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండేది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. ఇటీవల జరిగిన ఉన్నావ్ అత్యాచారం కేసును దృష్టిలో ఉంచుకుని యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి యోగి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై , చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఈ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
6. నీతులు చెప్పే చంద్రబాబే.. హెరిటేజ్‌లో ఉల్లి రూ.200 విక్రయిస్తున్నారు: జగన్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ఉల్లి ధర పెరిగిపోవడంతో సమావేశంలో ఉల్లి అంశంపై చర్చ సాగింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో కిలో ఉల్లి రూ. 25కు అందిస్తున్నామని అన్నారు. ఒక వేళ ఉల్లి రాష్ట్రంలో అందుబాటులో లేకపోయినా… పక్క రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి అందిస్తున్నామన్నారు. తాము ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తామని, అదే చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కిలో ఉల్లి రూ. 200లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
7. ఆ బ్యాడ్మింటన్ ప్లేయర్.. ఓ ఇంటివాడయ్యాడు..!
భారత బ్యాడ్మింటన్ ఆటగాడు భమిడిపాటి సాయిప్రణీత్ ఓ ఇంటివాడయ్యాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్వేత జయంతితో సాయిప్రణీత్ వివాహం జరిగింది. ఆదివారం కాకినాడలోని ఓ పంక్షన్ హాల్‌లో వీరిద్దరి వివాహవేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకకు సాత్విక్ సాయిరాజు సహా పలువురు బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరయ్యారు. ఇక సాయిప్రణీత్-శ్వేత జంటకు సోషల్ మీడియా ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
8. కేసీఆర్‌కు జగన్ హ్యాట్సప్.. ఎందుకంటే..!
అమరావతి : దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమర్థించారు. సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ దిశ నిందితులను కాల్చినా తప్పులేదన్నారు. ఒక అమ్మాయి పట్ల మూర్ఖంగా ప్రవర్తించి ఆమె పై అత్యాచారం చేయడమే కాకుండా సజీవంగా తగలబెట్టిన మృగాలను మట్టుబెట్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు హాట్స్ఆఫ్ చెప్పారు. చట్టాలు మారాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టాలు తేవాలని జగన్ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
9. ‘నయనతార’కు ఇంకెన్ని సార్లు పెళ్లి చేస్తారు ?
లేడీ సూపర్ స్టార్ గా నయనతార చూపించే స్టార్ డమ్ దెబ్బకు నిర్మాతలు ఆమె రోల్స్ ను లేపేస్తున్నారు. దీనికితోడు ఈ ముదురు భామ వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటుంది. ప్రియుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న నయన్ ఆ ప్రేమ మత్తును ఫుల్ గా ఎంజాయ్ చేద్దామనుకుంటే.. తమిళ్ మీడియా మాత్రం తెగ డిస్టర్బ్ చేస్తోందట. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..
10. హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం..!
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కొడుకు నుంచి 40 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ను వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీ కోసం డ్రగ్స్ తెచ్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కత్తివెంకటస్వామి కొడుకును అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..