కేసీఆర్‌కు జగన్ హ్యాట్సప్.. ఎందుకంటే..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Dec 2019 11:52 AM GMT
అమరావతి : దిశ నిందితుల ఎన్ కౌంటర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమర్థించారు. సోమవారం ఆయన అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ దిశ నిందితులను కాల్చినా తప్పులేదన్నారు. ఒక అమ్మాయి పట్ల మూర్ఖంగా ప్రవర్తించి ఆమె పై అత్యాచారం చేయడమే కాకుండా సజీవంగా తగలబెట్టిన మృగాలను మట్టుబెట్టించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు హాట్స్ఆఫ్ చెప్పారు. చట్టాలు మారాలని, మహిళలపై అత్యాచారాలు చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టాలు తేవాలని జగన్ సూచించారు. ఇవాళ దిశ హత్య నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీరు బాలేదని, వెంటనే చట్టాలు మార్చితే మహిళలపై దాడులు తగ్గే అవకాశాలు ఉన్నాయని జగన్ పేర్కొన్నారు. చట్టాలు మార్చితేనైనా ఇలాంటి మృగాళ్లలో కొంతైనా మార్పు రావచ్చని, ఆడపిల్ల జోలికి వెళ్లాలంటేనే భయపడేలా చట్టాలను తీసుకురావాలని జగన్ కోరారు.
Next Story