హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం రేపింది. కాంగ్రెస్‌ నేత కత్తి వెంకటస్వామి కొడుకు నుంచి 40 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్స్‌ను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బర్త్‌ డే పార్టీ కోసం డ్రగ్స్‌ తెచ్చుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కత్తివెంకటస్వామి కొడుకును అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.