న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

By Newsmeter.Network  Published on  3 Dec 2019 9:06 PM IST
న్యూస్‌మీట‌ర్.. టాప్ 10 న్యూస్‌

1. ఖబర్ధార్‌: పవన్‌ కల్యాణ్‌కు వార్నింగ్‌ ఇచ్చిన ‘రాజాసింగ్‌’

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. హిందూ మతంపై మాట్లాడడం తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పవన్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా ఖండించారు. హిందూమతం, ధర్మం గురించి కనీస అవగాహన లేకుండా పవన్‌ మాట్లాడటం సరికాదన్నారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని రాజాసింగ్‌ ప్రశ్నించారు. హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైందని కాదని, లౌకికతత్వంపై. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

2. ఆ జైల్లో తలారీ లేడు.. నెలరోజుల్లోనేమో నిర్భయ నిందితులకు ఉరిశిక్ష.. అసలేం జరుగుతోంది..!

2012లో డిసెంబర్‌ 16న దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్యాచారం ఘటన నిర్భయ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కదులుతున్న బస్సులో ఒక పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు రాక్షసులుగా ప్రవర్తించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బస్సు నుంచి రోడ్డు పక్కన పడేశారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 20 న మరణించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

3. మొట్ట‌మొద‌టి టెక్ట్స్‌ మెసేజ్‌కు 27 ఏళ్లు.. ఎప్పుడు.. ఎవ‌రు.. ఎవ‌రికి పంపారో తెలుసా..?

రోజూ వంద‌ల మెసేజ్‌లు రిసీవ్ చేసుకునే మ‌నం.. అస‌లు మొట్ట‌మొద‌టి మెసేజ్ ఎప్పుడు పంపారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసామా..? చేసుండము. నెట్‌వ‌ర్క్ స‌ర్వీసుల చ‌ల‌వ‌తో రోజుకు వందల‌ మెసేజ్‌ల‌తో బిజీగా ఉండే మ‌నం.. అస‌లు మొద‌టి ఎవ‌రికి ఎవ‌రు పంపారో తెలుసుకుందాం. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

4.‘నాసా’.. మీతో మాకు ప‌నుంది… వారిద్ద‌రి సిక్సులు కూడా క‌నిపెట్టాలి..!

ఇంత‌వ‌ర‌కు ఒక్క‌ ఐపీఎల్‌ టైటిల్ కూడా సాధించని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారైనా టైటిల్‌ను గెలవాలని చూస్తుంది. ఇందుకు సంబందించి ఆర్సీబీ యాజ‌మాన్యం ఐదు నెల‌లు ముందుగానే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంది. అయితే.. ఓ ఫ‌న్నీ ట్వీట్‌తో ఆర్సీబీ త‌న అభిమానుల‌ను అల‌రించింది. అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ నాసా.. చంద్రయాన్‌-2 ‘విక్రమ్‌ ల్యాండర్‌’ ఆచూకీని కనుగొన్న విష‌యం తెలిసిందే. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

5. వైద్యురాలి ఘటన మరువక ముందే మరో దారుణం..!

దేశంలో మానమృగాలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు కామాంధుల ఆగడాలు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. మృగళ్లు ప్రవర్తిస్తున్న తీరు సమాజం తలదించుకునేలా చేస్తోంది. ఆడ పిల్లగా పుట్టిందంటే చాలు సమాజం భయపడుతోంది. అమ్మతనాన్ని కామాంధులు ఎక్కడ అవమానిస్తారరోనని భయమేస్తోంది. హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే బీహార్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

6. ఎస్‌బీఐ ‘డెబిట్‌’ కార్డులు ఇక పని చేయవు

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాకిచ్చింది. ఎస్‌బీఐ మ్యాగ్‌స్ట్రిప్ డెబిట్ కార్డులు డిసెంబర్ 31 తర్వాత పనిచేయవని మరోమారు స్ప‌ష్టం చేసింది. ఇప్పటికీ కూడా మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని, వీలైనంత త్వరగా డెబిట్ కార్డులను మార్చుకోవాలని సూచించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

7. బిడ్డ భవిష్యత్తు కోసం ఆరాటపడే తల్లిదండ్రుల మాదిరిగానే జార్ఖండ్‌ కోసం కృషి చేస్తున్నా: మోదీ

ఎదుగుతున్న బిడ్డ భవిష్యత్తు గురించి ఆరాటపడే తల్లిదండ్రుల మాదిరిగా తాను కూడా జార్ఖండ్ కోసం కృషి చేస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జార్ఖండ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా మంగళవారం ఖుంతిలో నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడుతూ…జమ్మూ-కశ్మీరులో కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని, అధికరణ 370ని రద్దు చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

8. నాని కొత్త సినిమా టైటిల్ ఇదే

గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో ఆక‌ట్టుకున్న నేచుర‌ల్ స్టార్ నాని… ప్ర‌స్తుతం వి అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ రోజు నాని కొత్త సినిమాని ఎనౌన్స్ చేసాడు. ఈ మూవీకి నిన్ను కోరి, మ‌జిలీ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

9. ఆ జాలరికి వలలో చేపకు బదులు ఏం పడిందో తెలుసా..?

పుదుచ్చేరికి చెందిన ఆ జాలరులు సముద్రంలో వల వేస్తే బరువుగా ఏదో తగిలింది. లాగబోతే అది మామూలు చేప కాదనిపించింది. డాల్ఫినో, తిమింగలమో పడిందన్న ఫీలింగ్ వచ్చేసింది. “రండ్రోయ్… రండ్రోయ్… మన పది రోజుల ఆదాయం ఒకేసారి వచ్చేసింది” అని వాళ్లు తోటివాళ్లను కూడా పిలిచారు. అందరూ తలో చేయి వేసి సాయం చేశారు. ఎంతో కష్టపడి లాగితే బయటకు వచ్చిన దాన్ని చూసి వాళ్ల నోళ్లు అలాగే తెరిచి ఉండిపోయాయిపుదుచ్చేరికి చెందిన ఆ జాలరులు సముద్రంలో వల వేస్తే బరువుగా ఏదో తగిలింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

10. కూతురి ప‌ట్ల‌ ప‌శువులా ప్ర‌వ‌ర్తించిన ఆ తండ్రికి 20 ఏళ్ల జైలుశిక్ష‌..!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన‌ ‘జస్టిస్ ఫర్ దిశా’ వివాదం నడుస్తుండ‌గానే విజయవాడ స్పెషల్ కోర్టు ఓ రేప్ కేసులో సంచలన తీర్పు చెప్పింది. క‌న్న‌కూతురు లాంటి మైనర్ బాలికపై దారుణానికి ఒడిగ‌ట్టిన‌ మారు తండ్రికి కోర్టు ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది. వివ‌రాళ్లోకెళితే.. సైకం కృష్ణారావు అనే వ్య‌క్తి ఇబ్రహీంపట్నం వాస్త‌వ్యుడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి ...

Next Story