గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో ఆక‌ట్టుకున్న నేచుర‌ల్ స్టార్ నాని… ప్ర‌స్తుతం వి అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ రోజు నాని కొత్త సినిమాని ఎనౌన్స్ చేసాడు.

ఈ మూవీకి నిన్ను కోరి, మ‌జిలీ చిత్రాల ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే… వైవిధ్యంగా ట‌క్ జ‌గ‌దీష్ అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఇందులో నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ, ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ లో వెన‌క్కి తిరిగి త‌న ట‌క్ ను స‌రి చేసుకుంటున్న‌ట్టుగా నాని లుక్ ఉంది.

ఈ టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే.. ఈ టైటిల్ ఏదో కొత్త‌గా ఉందే అనిపించింది. నాని – శివ నిర్వాణ కాంబినేష‌న్ లో నిన్ను కోరి సినిమా వ‌చ్చింది. ఈ సినిమా స‌క్స‌స్ అయిన విష‌యం తెలిసిందే. రెండోసారి వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. 2020 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.