నాని కొత్త సినిమా టైటిల్ ఇదే
By Newsmeter.Network
గ్యాంగ్ లీడర్ సినిమాతో ఆకట్టుకున్న నేచురల్ స్టార్ నాని... ప్రస్తుతం వి అనే సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే... ఈ రోజు నాని కొత్త సినిమాని ఎనౌన్స్ చేసాడు.
ఈ మూవీకి నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టైటిల్ విషయానికి వస్తే... వైవిధ్యంగా టక్ జగదీష్ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇందులో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో వెనక్కి తిరిగి తన టక్ ను సరి చేసుకుంటున్నట్టుగా నాని లుక్ ఉంది.
ఈ టైటిల్ ఎనౌన్స్ చేయగానే.. ఈ టైటిల్ ఏదో కొత్తగా ఉందే అనిపించింది. నాని - శివ నిర్వాణ కాంబినేషన్ లో నిన్ను కోరి సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సస్ అయిన విషయం తెలిసిందే. రెండోసారి వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. 2020 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.