ఆ జాలరికి వలలో చేపకు బదులు ఏం పడిందో తెలుసా..?

By అంజి  Published on  3 Dec 2019 8:53 AM GMT
ఆ జాలరికి వలలో చేపకు బదులు ఏం పడిందో తెలుసా..?

పుదుచ్చేరికి చెందిన ఆ జాలరులు సముద్రంలో వల వేస్తే బరువుగా ఏదో తగిలింది. లాగబోతే అది మామూలు చేప కాదనిపించింది. డాల్ఫినో, తిమింగలమో పడిందన్న ఫీలింగ్ వచ్చేసింది. “రండ్రోయ్... రండ్రోయ్... మన పది రోజుల ఆదాయం ఒకేసారి వచ్చేసింది” అని వాళ్లు తోటివాళ్లను కూడా పిలిచారు. అందరూ తలో చేయి వేసి సాయం చేశారు. ఎంతో కష్టపడి లాగితే బయటకు వచ్చిన దాన్ని చూసి వాళ్ల నోళ్లు అలాగే తెరిచి ఉండిపోయాయిపుదుచ్చేరికి చెందిన ఆ జాలరులు సముద్రంలో వల వేస్తే బరువుగా ఏదో తగిలింది. లాగబోతే అది మామూలు చే.

ఇంతకీ వలలు చింపేసేంత బరువుండి, నైలాన్ తెగల్ని తుంపేసేంత షార్ప్ గా ఉన్న అది తిమింగలమూ కాదు. డాల్ఫిన్ అంతకన్నా కాదు. అది ఒక రాకెట్ లా ఉంది. దానిపై కొన్ని రాతలు ఉన్నాయి. సముద్రం ఉప్పునీరుకాస్త పై పెయింట్ ను తినేసింది. కాస్త తుప్పు పట్టింది. అంతే...

జాలరులు దాన్ని ఎలాగోలా ఒడ్డుకు చేర్చారు. ఆ తరువాత సెల్ఫీలు, విడియోల హడావిడి మొదలైంది. అందరూ పరుగులు వచ్చి గుమి కూడిపోయారు. చివరికి తేలిందేమిటంటే అంతరిక్షంలోకి పంపే సాటిలైట్ లాంచింగ్ వెహికిల్ తాలూకు మోటార్. ఈ రాకెట్ ను ఈ ఏడాది మార్చి 22 న తయారు చేశారు. దీన్ని పరిశీలించిన ఇస్రో అధికారులు లోపలి మోటారు పూర్తిగా దగ్ధమైపోయి, పై తొడుగు మాత్రం మిగిలిఉందని వివరించారు. రాకెట్ లాంచింగ్ వివిధ దశల్లో వివిధ భాగాలు ఊడిరావడం సహజమని, అందులో భాగంగానే ఈ శకలం సముద్రంలో పడిపోయిందని తెలిపారు. ఇస్రో ఇప్పుడు ఈ శకలాన్ని శ్రీహరికోటకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తోంది.

Next Story