ముఖ్యాంశాలు

  • వైద్యురాలి ఘటన మరువకముందే బీహార్‌లో మరో దారుణం
  • రెచ్చిపోతున్న మానవమృగాళ్లు

దేశంలో మానమృగాలు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు కామాంధుల ఆగడాలు అడ్డూ.. అదుపు లేకుండా పోతోంది. మృగళ్లు ప్రవర్తిస్తున్న తీరు సమాజం తలదించుకునేలా చేస్తోంది. ఆడ పిల్లగా పుట్టిందంటే చాలు సమాజం భయపడుతోంది. అమ్మతనాన్ని కామాంధులు ఎక్కడ అవమానిస్తారరోనని భయమేస్తోంది. హైదరాబాద్‌లోని షాద్‌నగర్‌లో వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన మరవకముందే బీహార్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. 2012లో ఢిల్లీలోజరిగిన నిర్భయ ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎన్నిచర్యలు చేపట్టినా..ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వైద్యురాలి ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతుంటే.. తాజాగా బీహార్‌లో మరో ఘటన చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ వైపు హత్యాచార నిందితులకు తక్షణమే కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలని నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీహార్‌లో జరిగిన ఘటనకు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. బక్సర్ జిల్లాలోని కుకుఢా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ఓ బాలికను అత్యాచారం చేసి అనంతరం హత్య బాలికకు నిప్పంటించి తగలపెట్టారు. ఈ రోజు ఇలాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో కాలిన ఓ బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లు బక్సర్ డీఎస్పీ సతీశ్‌కుమార్ పేర్కొన్నారు.

రాజధాని నగరం పాట్నాకు సుమారు 100కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే  పోస్టుమార్టం అనంతరం రిపోర్టుల ద్వారా మరింత సమాచారం అందే అవకాశం ఉందని డీఎస్పీ తెలిపారు. ఘటన స్థలానికి చాలా మంది చేరుకుప్పటికి మృతురాలిని మాత్రం ఎవరూ గుర్తించలేకపోయారు. కాగా, బాలికను అత్యాచారం చేసిన ఆ తర్వాత గన్‌తో తలపై కాల్చి ఆమెకు నిప్పంటించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.