న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jan 2020 9:02 PM IST
న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

1. నేను కేసీఆర్ మేన‌ల్లుడిని.. న‌న్నే ఆపుతారా..?

హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్ చౌరస్తాలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. సీఎం కేసీఆర్‌కు మేనల్లుడినని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వాహానాల త‌నిఖీల్లో భాగంగా ట్రాపిక్ పోలీసులు ఓ వాహాన దారుడి ఆప‌గా అత‌ని వ‌ద్ద ఎలాంటి ప‌త్రాలు లేవు. ప‌త్రాల‌ను అడ‌గ‌గా పోలీసుల‌తో పై విధంగా మాట్లాడాడు. అక్క‌డే ఉన్న కొంద‌రు వీడియో చిత్రీక‌రించ‌డంతో ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

2. అలా ముందుకెళ్తామంటున్న ‘కాషాయపవనాలు’

అమరావతి: రాష్ట్రంలోని బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ-జనసేన కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్రంలోని నెలకొన్న సమస్యలపై కలిసిపోరాడతమని, జనసేన-బీజేపీ భావజాలం ఒక్కటేనన్నారు. ఏపీ భవిష్యత్‌ కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నామని పవన్‌ వివరించారు. స్ధానిక, సార్వత్రిక ఎన్నికల్లోనే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

3. అపోజిషన్ వర్సెస్ మోదీ.. ‘ఎలకలూ పిల్లుల’ కథ..!

పాత కాలం కథ ఒకటుంది. ఎలకలన్నీ కలిసి పిల్లిపై పోరాటం ప్రకటించాయి. ఎలకలన్నీ పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. పిల్లి మెడలో గంట కట్టాలని నిర్ణయించుకున్నాయి. కానీ కొన్ని ఎలకలు పిల్లిని నానా తిట్లు తిడుతూనే సమావేశాన్ని బహిష్కరించాయి. మిగతా పిల్లులు ఏలాగోలా సమావేశమయ్యాక నాయకత్వం ఎవరి చేతుల్లో ఉండాలన్న ప్రశ్న తలెత్తింది. అందరి కన్నా బలహీనంగా ఉన్న ఎలక లేవలేను గానీ చావగొట్టగలను అని ప్రకటించుకుంది. మీ అందరికీ నేతను నేనే అంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

4. క‌ర్నూలుకు హైకోర్టు త‌ర‌లింపు సాధ్య‌మేనా..?

ఇల్లు అలకగానే పండుగ కాదు. గ్రాఫిక్స్‌లో ఎత్తైన భ‌వ‌నాలు చూపెట్ట‌గానే న‌గ‌రం త‌యారైపోదు. మూడు రాజ‌ధానులంటూ ప్ర‌క‌ట‌న చేయ‌గానే వాటికై అవే ఏర్ప‌డిపోవు. అలా నాడు అమ‌రావ‌తి మ్యాప్ మాత్ర‌మే చూపెట్టారు క‌నుకనే రాజ‌ధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములు ఇంకా ఖాళీ స్థ‌లాలుగా మిగిలి ఉన్నాయి. మూడు విడ‌తల సాగు భూమి బీడుగా మారిన వైనం స‌గ‌టు మ‌నిషి మ‌న‌సును క‌ల‌చివేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

5. రష్యా ప్రధాని రాజీనామా

రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేసారు. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగినట్లు నట్లు రష్యా లోని టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో దిమిత్రి రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. పుతిన్‌ మాట్లాడుతూ… పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

6. ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్‌ ఇంటిపై ఐటీ రైడ్స్‌

కర్నాటక: ప్రముఖ సినీనటి రష్మిక మందాన ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇటీవల తెలుగు సినిమాలతో రష్మిక బాగా పాపులర్‌ అయ్యింది. ప్రస్తుతం హీరోయిన్‌ రష్మిక సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్‌ మీట్‌లో పాటిస్పేట్‌ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7.30 గంటలకు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

7. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడిగా శైలజానాథ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పీసీసీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత సాకే శైలజానాథ్ నియ‌మితుల‌య్యారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్లను కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ నియమించారు. తులసి రెడ్డి, షేక్ మస్తాన్ వలీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

8. టీమిండియాకు షాక్‌.. రెండో వ‌న్డేకు రిష‌బ్ పంత్ దూరం

టీమిండియాకు ఎదురుదెబ్బ త‌గిలింది. తొలి వ‌న్డేల్లో ఘోర ఓట‌మితో స‌త‌మ‌త‌మ‌వుతున్న టీమిండియాకు యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ రూపంలో మ‌రో దెబ్బ‌త‌గిలింది. వాంఖడే వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో కాంకషన్ (తల అదరడం) కారణంగా వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రిషబ్ పంత్ ఇంకా కోలుకోలేదట‌. దీంతో రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగే రెండో వన్డే నుంచి ఇప్పటికే తప్పుకున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్స్ ఆఖరి వన్డేలో ఆడటంపైనా నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

9. పాముకు చుక్కలు చూపించిన మహిళ

ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో లాంటి దేశాల్లో టాయిలెట్లలోకి పాములు రావ‌డం ఇటీవ‌ల కాలంలో స‌ర్వ‌సాధారం అయిపోయింది. కొంత మంది వాటి నుంచి ఈజీగా త‌ప్పించుకుంటుండ‌గా మ‌రికొంద‌రు పాము కాటుకు గుర‌వుతున్నారు. తాజాగా థాయ్ లాండ్ దేశంలో ఓ మ‌హిళ పాముకే చుక్క‌లు చూపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

10. బీసీసీఐ కాంట్రాక్టులో ధోనికి ద‌క్క‌ని చోటు.. ఇక ధోని కెరీర్ ముగిసిన‌ట్లేనా..?

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి బీసీసీఐ( భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు) ఝ‌ల‌క్ ఇచ్చింది. 2019-20 సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన భారత క్రికెటర్ల కాంట్రాక్ట్‌ జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. అసలు ఏ కేటగిరీలోనూ ధోనికి అవకాశం కల్పించలేదు. దీంతో కెరీర్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక ధోనిని అంత‌ర్జాతీయ మ్యాచుల్లో చూసే అవ‌కాశం ఉండ‌క పోవ‌చ్చు అని ప‌లువురు మాజీలు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

Next Story