'సరిలేరు నీకెవ్వరు' హీరోయిన్ ఇంటిపై ఐటీ రైడ్స్
By Newsmeter.Network Published on 16 Jan 2020 6:53 AM GMTకర్నాటక: ప్రముఖ సినీనటి రష్మిక మందాన ఇంటిపై ఐటీ దాడులు కలకలం రేపాయి. కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇటీవల తెలుగు సినిమాలతో రష్మిక బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం హీరోయిన్ రష్మిక సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ మీట్‌లో పాటిస్పేట్ చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7.30 గంటలకు రష్మిక ఇంట్లోని అధికారులు దాడులు చేశారు. రష్మిక ఇంట్లో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. కాగా ఐటీ దాడులపై రష్మిక మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. రష్మిక ఇంటిపై ఐటీ దాడిని ఆమె మేనేజర్ ఖండించారు. రష్మిక ప్రతి అకౌంట్, లావాదేవీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. రష్మిక తండ్రి మదన్ వ్యాపారాలపై ఐటీ దాడులు జరిగాయని రష్మిక మేనేజర్ తెలిపారు.
రష్మిక మందాన సినీ ఇండస్ట్రీకి వచ్చి 7 సంవత్సరాలు అవుతోంది. మొదటగా కన్నడ చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత కిర్రిక్ పార్టీ సినిమాతో ఆమె అప్పటి నుంచి ఫుల్ బిజీగా మారింది. వరుస సినిమాలతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు నితిన్ సరసన బీష్మ చిత్రంలో నటిస్తోంది. బెంగళూరులోని తన ఫ్లాట్‌కు, సినీ చాంబర్‌కు ట్యాక్స్ పే చేయడం లేదని రశ్మికపై రూమర్స్ వస్తున్నాయి. రష్మిక ఇవాళ మధ్యాహ్నం సరిలేరు నీకెవ్వరు టీమ్‌తో తిరుపతి వెళ్తున్నారు. రేపు వరంగల్‌లో సక్సెస్‌మీట్‌లో రష్మిక పాల్గొననున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రష్మిక నివాసం ఉంది.