పాముకు చుక్కలు చూపించిన మహిళ

By Newsmeter.Network  Published on  16 Jan 2020 1:55 PM GMT
పాముకు చుక్కలు చూపించిన మహిళ

ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌లో లాంటి దేశాల్లో టాయిలెట్లలోకి పాములు రావ‌డం ఇటీవ‌ల కాలంలో స‌ర్వ‌సాధారం అయిపోయింది. కొంత మంది వాటి నుంచి ఈజీగా త‌ప్పించుకుంటుండ‌గా మ‌రికొంద‌రు పాము కాటుకు గుర‌వుతున్నారు. తాజాగా థాయ్ లాండ్ దేశంలో ఓ మ‌హిళ పాముకే చుక్క‌లు చూపింది.

అనా అనే మహిళ త‌న పిల్ల‌లో క‌లిసి నివ‌సిస్తోంది. బాత్రూమ్ కి వెళ్లిన అనా టాయిలెట్ మీద కుర్చొంది. అప్పటికే బాత్రూమ్‌లోకి దూరిన పామును ఆమె గమనించలేదు. దీంతో పాము ఆమె తోడ మీద కాటు వేసింది. అయితే ఆమె భయపడకుండా పామును రెండు చేతులతో పట్టుకుంది. దీంతో ఆ పాము ఆమె చేతులను చుట్టేసింది.

బాత్రూమ్‌లో నుంచి తల్లి అరుపులు విన్న పిల్లలు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. వాళ్లు తెచ్చిన కట్టర్‌తో పామును కోసేందుకు ప్రయత్నించింది. అప్పటికీ అది పట్టు వదల్లేదు. అనంతరం సుత్తితో పాము తల మీద కొట్టింది. దీంతో పట్టువదిలింది. ఈ ఘటనలో అనాకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనను అనా కుమార్తె ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ పోస్ట్ ను 61 వేల మందికి పైగా షేర్ చేసుకున్నారు. ఘటనలో తన తల్లి క్షేమంగానే ఉందని, అటవీ అధికారులు పామును రక్షించారని తెలిపింది.

Next Story