న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

By సుభాష్  Published on  17 Jan 2020 9:52 PM IST
న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

1.పబ్ లో ‘రేవ్ పార్టీ’ వెనుక ఉన్న నిజాలను బయటపెట్టిన ‘డీసీపీ’

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ లో ఆదివారం ఓ పబ్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈనెల 12న ఓ పబ్‌లో అమ్మాయిలతో డ్యాన్స్‌ లు చేయిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

2.వావ్ మ‌నీష్.. వాట్ ఏ క్యాచ్‌..!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆట‌గాడు మ‌నీష్ పాండే త‌న ఫీల్డింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. అసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(15)ను త‌న అధ్బుత‌మైన ఫీల్డింగ్‌తో పెవిలియ‌న్ చేర్చాడు. మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్సు నాలుగో ఓవర్‌ రెండో బంతిని వార్న‌ర్ ఆఫ్‌ సైడ్‌కు ఆడ‌గా.. మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌.. సింగిల్‌ హ్యాండ్‌తో ఒడిసిప‌ట్టుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

3. కొల్లాపూర్ లో ‘సింగం’ డాన్స్

కొన్నాళ్ల క్రితం వరకూ ఆయన, కెసీఆర్ లు మంచి మిత్రులు. రాజకీయాలే కావు, సామాజిక వర్గాల పరంగా సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్ స్వయానా రాజవంశం కాకపోయినా ఆయన నిజాం ఏలుబడిలోని ఒక సంస్థానానికి రాజు. దాంతో కేసీఆర్ వద్ద ఆయన గౌరవ మర్యాదలకేం లోటు ఉండేది కాదు. అంతే కాదు.. చాలా మంది టీఆర్ఎస్ నేతలే కేసీఆర్ ను నమ్మని సమయంలో ఆయన తన కాంగ్రెస్ మంత్రిపదవిని కాదనుకుని కేసీఆర్ తో చేతులు కలిపారు. అందుకే ఆయనది పార్టీలో ప్రత్యేక స్థానం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

4. చేతులారా చంద్ర‌బాబుకు అస్త్రం అందించిన జ‌గ‌న్‌..!

ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిగా మారాయి. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు బూస్ట్ ఇచ్చార‌ని, జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు కృత‌జ్ఞ‌త‌లు చెప్పే స‌మ‌యం వ‌చ్చిందంటూ రాజ‌కీయ విశ్లేష‌కుల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా, 2019 ఎన్నిక‌ల త‌రువాత టీడీపీ డీలా ప‌డిపోయిన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీకి 40 శాతం ఓట్లు వ‌చ్చినా కేవ‌లం 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

5.మార్కెట్లో పాపులర్ అయిన కొత్త తెలుగు టీ షర్ట్స్

2017లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి కలసి ఓ ఇంగ్లిష్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన‌ విషయం తెలుగు సినిమా అభిమానులందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ మోహన్ బాబు డైలాగ్ డెలివరీని మెచ్చుకుంటూ పదే పదే పలు ప్రశ్నల్ని సంధించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. తెలుగు డైలాగ్ పవర్ అలాంటిది మరి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

6.ముహూర్తం: ఫిబ్రవరి 1వ తేదీ.. ఉదయం 6 గంటలకు..

నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురిని తీహార్‌ జైలులోని ఉరివేసే 3వ నెంబర్‌ జైలుకు తరలించారు. నలుగురు దోషులైన అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్త, ముఖేష్‌సింగ్‌, వినయ్‌ లను మొదటిసారిగా ఉరిశిక్ష జరిగే జైలు నంబర్‌ 3కు తరలించారు. వీరికి 22న ఉరిశిక్ష వేయాల్సిఉండగా, దోషి ముఖేష్‌ సింగ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ కారణంగా అది వాయిదా పడింది. దీంతో రాష్ట్రపతి ఆ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురికి ఉరిశిక్ష వేయాలని తాజాగా కోర్టు వెల్లడించింది. ఈ నలుగురిని కూడా వేర్వేను సెల్స్‌ లో ఉంచి సీసీటీవీల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

7. ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్..

జ‌న‌వ‌రి 31 నుంచి రెండు రోజుల పాటు బ్యాంకుల సేవ‌లు నిలిచి పోనున్నాయి. దాని ప్ర‌భావం ఏటీఎం పైనా ప‌డనుంది. విడతలవారీగా చేపట్టనున్న జాతీయ స్థాయి సమ్మెకు సంబందించి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(బ్యాంక్ ఉద్యోగ యూనియన్ల ఉమ్మడి ఫోరం-యూఎఫ్‌బీయూ) గురువారం కీలక ప్రకటన చేసింది. వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

8. నిర్ణీత క‌క్ష్య‌లో జీశాట్-30 ఉప‌గ్ర‌హాం..

ఫ్రెంచి గయానా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 3357 కిలోల బ‌రువు ఉన్న జీశాట్‌ 30 ఉపగ్రహాన్నిశుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

9. ఆయనో ఫ్రీలాన్స్‌ పోలిటీషియన్‌: ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి

జనసేన అధినేత పవన్ కల్యాన్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి సిద్ధాంతాలు లేవని, ఆయన ఒక ప్రీ లాన్స్‌ పోలిటీషియన్‌ అంటూ వ్యాఖ్యనించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ స్థిరత్వం, వ్యక్తిత్వం లేదని ఆరోపించారు. బీజేపీ, జనసేన కూటమితో తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

10.మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. ఆ పేరును మార్చేస్తా..

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల వేడి జోరందుకుంది. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్‌ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీని గెలిపిస్తే నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. నగరంలో మేయర్‌ పదవి చేపడితే ఏం చేస్తారనే విషయాలను ఆయన ప్రజలకు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి..!

Next Story