ఫ్రెంచి గయానా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది. ఇన్‌శాట్‌- 4ఏ స్థానంలో సేవలందించేందుకు జీశాట్‌-30 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 3357 కిలోల బ‌రువు ఉన్న జీశాట్‌ 30 ఉపగ్రహాన్నిశుక్రవారం తెల్లవారుజామున 2:35 గంటలకు ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 వాహకనౌక ద్వారా 38 నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది కమ్యూనికేషన్‌ ఉపగ్రహం. దీని ద్వారా టెలివిజన్, టెలి కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంబంధించిన మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారత్‌కు చెందిన శక్తిమంతమైన సమాచార ఉపగ్రహం జీశాట్‌-30 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.