మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. ఆ పేరును మార్చేస్తా..
By సుభాష్ Published on 17 Jan 2020 12:43 PM GMTతెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి జోరందుకుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీని గెలిపిస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామని బీజేపీ మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. నగరంలో మేయర్ పదవి చేపడితే ఏం చేస్తారనే విషయాలను ఆయన ప్రజలకు వివరించారు. బీజేపీని గెలిపిస్తే ముందుగా ఇందూరుగా పేరును మార్చి, నిజామాబాద్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని అన్నారు. అలాగే పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామని, నిజామాబాద్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నగరంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలో చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
ఏ బిల్లులు తీసుకురావాలంటే కేటీఆర్ దగ్గర ట్యూషన్ చెప్పించుకునే అవసరం లేదని స్పష్టం చేశారు. కేటీఆర్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్రధాని మోదీపై లేనిపోని విమర్శలు చేస్తుంటే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. ఇటీవల భైంసాలో జరిగిన అల్లర్లకు వ్యతిరేకంగా తాను శనివారం ఒక రోజు నిరాహారదీక్ష చేపడితే పోలీసులు అనుమతి లేదంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.