జనసేన అధినేత పవన్ కల్యాన్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి సిద్ధాంతాలు లేవని, ఆయన ఒక ప్రీ లాన్స్‌ పోలిటీషియన్‌ అంటూ వ్యాఖ్యనించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ స్థిరత్వం, వ్యక్తిత్వం లేదని ఆరోపించారు. బీజేపీ, జనసేన కూటమితో తమకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే పవన్‌ కల్యాణ్‌ జనసేనను స్థాపించారని ఎద్దేవా చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్‌ సర్పంచ్‌గా పోటీ చేసి గెలవాలని, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని మాట్లాడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేందుకే సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. జగన్‌ చేస్తున్నఅభివృద్ధిని చూసి ఓర్వలేకే పవన్‌ లేనిపోని ఆరోపనలు చేస్తున్నాడని ఆరోపించారు

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.